ముంబై: టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి వన్డే మ్యాచ్ పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర జాబితా (NRC)లపై వ్యతిరేక ప్రదర్శనలకు వేదికైంది. మ్యాచ్ జరుగుతుండగానే మధ్యలోనే లేచినిల్చున్న పలువురు ఆందోళనకారులు.. సిఎఎ, ఎన్ఆర్సిలపై వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారిని స్టేడియంలోంచి బయటికి పంపించేశారు. ఇంకొందరు ఆందోళనకారులు ఫోటోలో చూపించిన విధంగా నో సీఏఏ, నో ఎన్ఆర్సి అనే నినాదాలు కనిపించే విధంగా అక్షరాలను ముద్రించిన టీ షర్టులను ధరించారు. ఇదే విషయమై ఓ నిరసనకారుడు మాట్లాడుతూ.. ''తాము కేవలం లేచినిల్చుని శాంతియుతంగా మాత్రమే తమ నిరసన తెలియజేశామని.. ఎటువంటి నినాదాలు చేయలేదు'' అని తెలిపారు.
Real also : పింక్ బాల్ టెస్ట్‌కి రెడీ: విరాట్ కోహ్లీ
మ్యాచ్‌కి వేదికైన ముంబై క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (MCA stadium)లోకి నల్ల దుస్తులు, టోపీలు ధరించిన వారిని అనుమతించడం లేదని తొలుత ఓ జర్నలిస్ట్ చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది. నల్ల రంగును నిరసనకు గుర్తుగా భావిస్తూ ఆ రంగు దుస్తులను ధరించినవారిపై సైతం ఆంక్షలు విధిస్తున్నారని ఓ జర్నలిస్ట్ చేసిన ట్వీట్ కలకలం రేపింది. అయితే, ఇదే విషయమై ఎంసిఏ నిర్వాహకులను సంప్రదించగా... తాము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని.. నల్ల రంగు దుస్తులపై నిషేధం వార్తల్లో నిజం లేదని వివరణ ఇచ్చారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..