Telangana Caste Census: దేశంలో కుల వ్యవస్థ.. కుల వివక్ష ఉందని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తెలిపారు. కుల వివక్ష ఉందని అంగీకరించి దానిని నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. నేను దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నానని ఆరోపిస్తున్నారు. దేశంలో ఉన్న వాస్తవం.. నిజం చెబితే దేశాన్ని విభజించడమా?' అని ప్రధాని మోదీని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
Also Read: Rahul Gandhi: బావర్చీ హోటల్లో రాహుల్ గాంధీ కోసం బిర్యానీ వెయిటింగ్.. వైరల్ వీడియో
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బీసీ కుల గణనపై హైదరాబాద్ బోయనపల్లిలోని గాంధీ ఐడియాలజీ కేంద్రంలో మంగళవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ మేధావులు, బీసీ సంఘాలతో సమాలోచనలు చేశారు. వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో రాహుల్ మాట్లాడారు.
Also Read: KTR: సెక్యూరిటీ లేకుండా వస్తే రేవంత్ రెడ్డిని ప్రజలు తన్నే పరిస్థితి
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణనతో కుల వ్యవస్థను రూపుమాపే ప్రయత్నం మొదలైందని రాహుల్ గాంధీ చెప్పారు. ఇక్కడ జరిగే కుల గణన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ప్రకటించారు. 'కుల గణనలో ఏ ప్రశ్నలు అడగాలి అనేది అధికారులు నిర్ణయించకూడదు. సామాన్య ప్రజలే నిర్ణయించాలి' అని స్పష్టం చేశారు. కుల వ్యవస్థ, కుల వ్యవస్థ ఉన్నప్పుడు అసమానతలు కూడా ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు.
మన దేశంలో కుల వ్యవస్థ బలంగా ఉందని.. అగ్రకులాలకు ఎప్పుడూ కుల వ్యవస్థ కనిపించదని రాహుల్ గాంధీ తెలిపారు. కుల గణన ద్వారా బడుగు బలహీనవర్గాలకు నష్టం జరగకుండా చూడవచ్చని చెప్పారు. అన్ని రంగాల్లో కుల వ్యవస్థ ఉందని.. రాజకీయ, న్యాయ వ్యవస్థల్లో.. ప్రైవేటు రంగంలోనూ కూడా కుల వ్యవస్థ ఉందని వివరించారు. ఆత్మ విశ్వాసాన్ని కుల వ్యవస్థ దెబ్బతీస్తుందన్నారు. కుల గణనకు తెలంగాణనే దేశానికి రోల్ మోడల్ కానుంది అని రాహుల్ గాంధీ ప్రకటించారు. 'మేము చేస్తున్నది కుల గణనే కాదు. పరిపాలన ఎలా ఉండాలో నిర్ణయిస్తున్నాం. ఏ వ్యవస్థలో ఎంత మంది ఓబీసీలు ఉన్నారో తెలుసుకోవాలి. రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తేస్తాం అని రాహుల్ గాంధీ ప్రకటన చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.