Banana Aftereffect In Telugu: అరటి పండ్లను రోజూ తినడం ఎంత మంచిదో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇందులో పొటాషియం అధిక మోతాదులో ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించి కండరాల పనితీరును మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. అలాగే అరటి పండ్లలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచి కణాలను రక్షించేందుకు కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ శరీర బరువును నియంత్రించి.. కొవ్వును తగ్గిస్తుంది. అలాగే డైలీ అరటి పండ్లు తినడం వల్ల శరీరానికి తగిన విటమిన్ b6 లభించి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అయితే చాలామంది ఇవన్నీ ప్రయోజనాలు కలుగుతాయని అరటి పండ్లను అతిగా తింటున్నారు.. నిజానికి వీటిని రోజు మితిమీరి తింటే మంచిదేనా? ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం అరటి పండ్లను అతిగా తినడం మంచిది కాదట. ఇందులో ఉండే పోషకాలే అనేకరకాల అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చట. అయితే అరటి పండ్లను రోజు తినడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
అరటి పండ్లను తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు:
బరువు పెరుగుతారు:
అరటిపండ్లలో ఎక్కువ మోతాదులో చక్కెర లభిస్తుంది. కాబట్టి రోజూ విచ్చలవిడిగా వీటిని తినడం వల్ల సులభంగా శరీరంలో రక్తంలోని చెక్కర పరిమాణాలు పెరిగి అధిక బరువుకు దారితీస్తుంది. దీనివల్ల సులభంగా బరువు పెరగడమే కాకుండా ఇతర అనారోగ్య సమస్యల బారిన పడతారు.
చక్కెర స్థాయిలను పెంచుతుంది:
డయాబెటిస్ ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో ప్రతిరోజు అరటి పండ్లను తినడం మానుకోండి. ఎందుకంటే ఇందులో ఇప్పటికే ఎక్కువ చక్కెర పరిమాణాలు ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు రెండు నుంచి మూడు చొప్పున తినడం వల్ల శరీరంలోని చక్కెర పరిమాణాలు విపరీతంగా పెరిగిపోయి.. మధుమేహం ప్రమాదం కూడా పెరుగుతుంది. దీంతో ఇతర దీర్ఘకాలిక వ్యాధులు తలెత్తే ఛాన్స్ ఉంది..
జీర్ణ క్రియ సమస్యలు:
కొంతమందిలో అరటి పండ్లు ఎక్కువగా తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రోజు మితిమీరి తింటే శరీరంలోని ఫైబర్ పరిమాణాలు ఒక్కసారిగా పెరిగిపోయి.. జీర్ణ క్రియపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయి. దీని కారణంగా వివిధ రకాల జీవక్రియ సమస్యలు కూడా వస్తాయి.
కిడ్నీ సమస్యలు:
కొంతమందిలో అరటి పండ్లు ఎక్కువ తింటే కిడ్నీ సమస్యలు కూడా వస్తున్నాయని ఇటీవలే డాక్టర్లు తెలిపారు. ఎందుకంటే ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది ఇది కిడ్నీలపై ప్రభావం చూపి రాళ్ల తయారీకి కీలకపాత్ర పోషిస్తుందని వారంటున్నారు. ఇప్పటికే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు అతిగా అరటి పండ్లను తినడం మానుకుంటే ఎంతో మంచిది.
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?
మైగ్రేన్ సమస్య:
ఇప్పటికే మైగ్రేన్ సమస్యలు ఉన్నవారు అరటి పండ్లను ఎంత తక్కువ తింటే అంత మంచిది.. ఎందుకంటే ఇందులో ఉండే కొన్ని మూలకాలు దీనిపై ప్రభావం చూపి.. మైగ్రేన్ ను తీవ్రతరం చేసే ఛాన్స్ ఉంది. అలాగే కొంతమందిలో అతిగా అరటి పండ్లు తింటే అలర్జీ వంటి సమస్యలు కూడా వస్తున్నాయట. కాబట్టి ప్రతిరోజు శక్తివంతంగా ఆరోగ్యవంతంగా ఉండేందుకు అరటి పండ్లను తగిన మోతాదులో మాత్రమే తినాల్సి ఉంటుంది.
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.