IMD Big Alert In AP: ఇటీవలి వరుసగా అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడనుందని హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ. తాజాగా మరో అల్పపీడనం ఏర్పడనుందని హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న ఈ అల్పపీడనం వల్ల ఈ నెల 7వ తేదీ నుంచి భారీవర్షాలు కురువనున్నాయి.
ఐఎండీ బిగ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల 7వ తేదీ నుంచి 11 వరకు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
నవంబర్ 5 లేదా 6వ తేదీలలో వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
దీని కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలలో సాధారణంగా కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని వెల్లడించింది. ఇప్పటికే గత నెలలో కూడా భారీవర్షాలతో ఏపీ అతలాకుతలమైన సంగతి తెలిసిందే.
దీంతో మరోసారి అల్పపీడనం ఏర్పడితే మళ్లీ భారీవర్షాలకు దారీ తీస్తుంది. నవంబర్ 6 తేదీ వరకు ఉష్ణోగ్రతలు తగ్గిపోయే అవకాశం ఉందని చెప్పింది. ఇదిలా ఉండగా గత నెలలో కూడా 3 అల్పపీడనలు బంగాళాఖాతంలో ఏర్పడ్డాయి. మత్స్యాకారులను, స్థానిక గ్రామస్థులను ప్రభుత్వం అలెర్ట్ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
నిన్న శుక్రవారం కూడా ఇటు తెలంగాణలో మధ్యాహ్నం వరకు ఉన్న వేడి వాతావరణం సాయంత్రం వరకు ఒక్కసారిగా చల్లబడింది. భారీ వర్షాలు కురిసాయి. ఈ నేపథ్యంలో దీపావళి వల్ల గాలి కాలుష్యానికి సైత చెక్ పడింది. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఎదురైనాయి.