US Election Result Date: అమెరికా అధ్యక్ష ఎన్నికలు యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. వైట్ హౌస్ లో కొలువుదీరే అమెరికా అధ్యక్షుడి ఎన్నిక కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తూ ఉంటుంది. అగ్రరాజ్యం, పెద్దన్న, అంకుల్ శ్యామ్ గా పిలవబడే అమెరికా అధ్యక్షుడి ఎన్నిక గురించి ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది. ప్రపంచంలో అత్యంత పురాతనమైన రాజ్యాంగము, ప్రజాస్వామ్య వ్యవస్థగా పేరుపొందిన అమెరికా ఎన్నికల ప్రక్రియ ఈ నవంబర్ 5వ తేదీన ఓటింగ్ జరగడం ద్వారా ఒక ప్రధాన ఘట్టం ముగియనుంది.
ఈసారి అమెరికా అధ్యక్ష పదవి కోసం అటు రిపబ్లికన్ పార్టీ నుంచి డోనాల్డ్ ట్రంప్, ఇక డెమోక్రటిక్ పార్టీ నుంచి కమలహరిస్ పోటీ పడుతున్నారు. అమెరికా ప్రజాస్వామ్యం భారత ప్రజాస్వామ్యం కన్నా భిన్నంగా ఉంటుంది. మనదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉంటుంది. అందుకే ఇక్కడ ఎంపీలు ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు. కానీ అమెరికాలో మాత్రం నేరుగా ప్రజలే అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అమెరికా అధ్యక్షుడినే సర్వోన్నత నేతగా గుర్తిస్తారు.
అయితే భారతదేశంలో ఎన్నికల ప్రక్రియలో కొన్ని వందలాది పార్టీలు పోటీ చేస్తాయి. ముందుగా ఇక్కడ ఎంపీగా ఎన్నికైన తరువాతే ఎక్కువగా సీట్లు సాధించిన పార్టీ తమ లోక్ సభ సభాపక్ష నేతను ఎన్నుకొని ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కానీ అమెరికాలో మాత్రం నేరుగా అధ్యక్ష పదవికే ఎన్నిక జరుగుతుంది. ప్రజలే నేరుగా అధ్యక్షుడిని తమ ఓట్ల ద్వారా ఎన్నుకుంటారు.
అయితే భారతదేశంలో లాగా. వందలాది రాజకీయ పార్టీలు ఉండవు. కేవలం రెండు రాజకీయ పార్టీలు మాత్రమే ప్రధాన పోటీలో ఉంటాయి. అవే రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ, మిగతా చిన్నా చితక పార్టీలు ఉన్నప్పటికీ, వాటి పోటీ నామమాత్రం మాత్రమే.అయితే అధ్యక్ష పదవికి ముందుగా ఆయా పార్టీల్లో ముందుగా మీరు అధ్యక్ష పదవికి నామినేట్ అయ్యేలా నేతలు పోటీ పడాల్సి ఉంటుంది. అధ్యక్ష అభ్యర్థిత్వం దక్కిన తర్వాతే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారు.
ఈసారి అమెరికాలో నవంబర్ 5వ తేదీన అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే అమెరికా టెక్నాలజీలో యావత్ ప్రపంచంలోనే ముందు వరసలో ఉన్నప్పటికీ అక్కడ నేటికీ కూడా బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరుగుతాయి. ప్రజలు పోస్ట్ ద్వారా కూడా ఓటు వేయవచ్చు.
Also Read: Schools Closed: దీపావళి సెలవులు స్కూళ్లకు ఎన్నిరోజులు వచ్చాయి తెలుసా? విద్యాశాఖ కీలక ఆదేశాలు..!
అమెరికా ఓటింగ్ ప్రక్రియ సుదీర్ఘమైనది:
అమెరికాలో ఆరు టైమ్ జోన్లు ఉండటం వల్ల వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు సమయాల్లో ఓటింగ్ జరుగుతుంది. దీని కారణంగా ప్రతి రాష్ట్రంలో ఓటింగ్ సమయం కూడా మారుతుంది. ఇది కాకుండా, దాదాపు ప్రతి రాష్ట్రం అనేక వారాల ముందుగానే వ్యక్తిగతంగా ఓటింగ్ లేదా పోస్టు ద్వారా ఓటు వేయడానికి అనుమతిస్తారు. ఇండియానా కెంటుకీలోని లాంటి కొన్ని రాష్ట్రాల్లో పోల్స్ సాధారణంగా ఉదయం 6 ప్రారంభమమవగా, అలాస్కా వంటి రాష్ట్రాల్లో చివరి పోల్స్ నవంబర్ 6న అర్థరాత్రి 1 గంటలకు ముగుస్తాయి.
US ఎన్నికలలో, ఎన్నికల రోజున పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది, రాష్ట్ర, స్థానిక అధికారులు ఓట్లను సేకరించి, ధృవీకరిస్తారు. నవంబర్ 5న అమెరికాలో ఓటింగ్ జరగనుంది. దీనికి ముందు అమెరికాలోని పలు ప్రాంతాల్లో ముందస్తు ఓటింగ్ జరుగుతోంది. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం, మంగళవారం వరకు, 1.5 కోట్ల మంది అమెరికన్లు తమ ఓటు వేశారు. ఈ ఓటింగ్ 47 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో పోస్ట్ ద్వారా జరిగింది. ప్రెసిడెంట్ గెలవడానికి 538 ఎలక్టోరల్ ఓట్లకు 270 అవసరం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
US: అమెరికాలో రాష్ట్రపతి ఎన్నికల విధానం ఎలా ఉంటుంది.. అమెరికాలో ఈవీఎం మెషిన్లు వాడరా