నాలుగు దశాబ్దాల సేవలకు ఇక సెలవు. అవును .. బహదూర్ ఇప్పుడు విశ్రాంతి తీసుకోనుంది. ఇంతకీ ఎవరి గురించి చెబుతున్నారనుకుంటున్నారా..! భారత వైమానిక దళానికి సేవ చేసిన మిగ్-27 గురించే. అవును.. 40 ఏళ్ల పాటు భారత వైమానిక దళానికి సేవలు అందించిన మిగ్- 27 ఈ రోజు ఘనంగా వీడ్కోలు పలికారు. ఇందుకోసం రాజస్థాన్ జోధ్ పూర్ లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో వాటర్ సెల్యూట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మిగ్-27 విమానానికి రెండు వైపులా పెద్ద వాటర్ కేనన్ లు జలాభిషేకం చేశాయి. ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్ సైనికులు మిగ్-27కు గౌరవ వందనం చేశారు.
#WATCH Indian Air Force's MiG-27 which retires today receives water salute at Air Force Station Jodhpur pic.twitter.com/qo1uX4o969
— ANI (@ANI) December 27, 2019
మిగ్-27 ప్రత్యేకతలు
* నాలుగు దశాబ్దాలుగా వైమానిక దళానికి సేవలు
* 1999 కార్గిల్ యుద్ధంలో కీలక పాత్ర
* ఆపరేషన్ పరాక్రమ్ లో ముఖ్య భూమిక
* ఇప్పటి వరకు IAF- 29 స్క్వాడ్రన్ లో సేవలు