/telugu/photo-gallery/puri-jagannadh-explains-about-emotional-blockmail-in-puri-musings-pa-180794 Puri Jagannadh: వాళ్లు అమాయకులుగా కన్పించే క్రిమినల్స్..  షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్.. స్టోరీ ఏంటంటే..? Puri Jagannadh: వాళ్లు అమాయకులుగా కన్పించే క్రిమినల్స్.. షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్.. స్టోరీ ఏంటంటే..? 180794

హైదరాబాద్: వరంగల్‌లో 2008లో ఇద్దరు ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థులు స్వప్నిక, ప్రణీతలపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితులను 3రోజుల అనంతరం పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. నిందితులు శాఖమూరి శ్రీనివాస్, బజ్జురి సంజయ్, పోతరాజు హరికృష్ణ తమ కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోతుండగా ఎన్‌కౌంటర్ చేసినట్టు అప్పటి వరంగల్ ఎస్పీ వీసీ సజ్జనార్ ప్రకటించారు. అప్పుడు వరంగల్ ఎస్పీగా సజ్జనార్ చేసిన ఎన్‌కౌంటర్ జాతీయ స్థాయిలో పతాక శీర్షికలకెక్కింది. యాసిడ్ దాడి ఘటన అనంతరం పోలీసులపై ఎంత వ్యతిరేకత వ్యక్తమైందో.. ఆ నేరానికి పాల్పడిన నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన తర్వాత పోలీసులకు జేజేలు పలుకుతూ అదేస్థాయిలో ప్రజల నుంచి మద్దతు లభించింది. 

తాజాగా దిశపై సామూహిక అత్యాచారం జరిపి, ఆమెను దారుణంగా హతమార్చిన ఘటన సైబరాబాద్ పరిధిలో చోటుచేసుకున్నప్పుడే ప్రజానికానికి అప్పటి వరంగల్ యాసిడ్ దాడి కేసు గుర్తుకొచ్చింది. ఎందుకంటే అప్పుడు ఆ కేసులో దర్యాప్తు అధికారిగా వరంగల్ ఎస్పీ హోదాలో ఉన్నది మరెవరో కాదు... ప్రస్తుతం సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ కావడమే. అందుకే వరంగల్ యాసిడ్ దాడి ఘటన కేసులో నిందితులను ఎలాగైతే ఎన్‌కౌంటర్ చేశారో... అదే తరహాలో దిశ కేసులోనూ నిందితులను ఎన్‌కౌంటర్ చేసి పారేయాలనే వాదన బలంగా వినిపించింది. 

మానవత్వం అనేది లేకుండా నిందితులు దిశపై జరిపిన అరాచకమే సాధారణ ప్రజానికంలో అంత ఆగ్రహావేశాలు పెల్లుబికడానికి కారణమైంది. అందుకే వారికి ఎన్‌కౌంటర్ మాత్రమే సరైన శిక్ష అనే అభిప్రాయం బలంగా వినిపించింది. అప్పుడు అందరి కళ్ల ముందు కదలాడిన ఆఫీసర్ ఇంకెవరో కాదు.. అప్పటి వరంగల్ ఎస్పీ, ప్రస్తుత సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్. తాజాగా దిశ కేసులో  నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టడంతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ మరోసారి వరంగల్ ఎన్‌కౌంటర్ సీన్‌ని గుర్తుకు తీసుకొచ్చారు.

Section: 
English Title: 
Warangal acid attack encounter in 2008 similar to encounter of accused in Disha gang rape and murder case by same IPS officer VC Sajjanar
News Source: 
Home Title: 

వరంగల్ యాసిడ్ దాడి కేసు నుంచి దిశ కేసు వరకు.. సేమ్ కాప్, సేమ్ స్టైల్ ఎన్‌కౌంటర్స్

వరంగల్ యాసిడ్ దాడి కేసు నుంచి దిశ కేసు వరకు.. సేమ్ కాప్, సేమ్ స్టైల్ ఎన్‌కౌంటర్స్
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
వరంగల్ యాసిడ్ దాడి కేసు ఎన్‌కౌంటర్‌ను గుర్తుకు తెచ్చిన సజ్జనార్
Publish Later: 
No
Publish At: 
Friday, December 6, 2019 - 12:03