దిశ కేసులో నలుగురు నిందితులను ఎన్కౌంటర్లో మట్టుబెట్టడం సరైందేనంటూ సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. అదే సమయంలో మరోపక్క కొందరు ప్రముఖుల నుంచి అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిందితులకు చట్టపరంగా శిక్షపడితే బాగుండేదని వారు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణ పోలీసులు మంచి నిర్ణయం తీసుకుని అత్యాచార నిందితులకు సరైన శిక్ష విధించారని యూపీ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. తెలంగాణ పోలీసులను చూసి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎంతో నేర్చుకోవాలని వారికి మాయావతి వారికి చురకలంటించారు.
దిశ కేసులో నిందితులుగా ఉన్న నలుగురిని పోలీసులు ఎన్కౌంటర్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఈ ఘటనపై నిర్భయ తల్లి స్పందించారు. దిశ కేసులో ఆమె తల్లిదండ్రులకు ఏడు రోజుల్లోనే న్యాయం లభించడం సంతోషంగా ఉందని ఆమె హర్షం వ్యక్తంచేశారు.
దిశపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో నిందితులుగా ఉన్న మహ్మద్ ఆరిఫ్ పాషా, జొల్లు శివ, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు నవీన్ కుమార్లను ఎన్కౌంటర్లో మట్టుపెట్టడంపై సాధారణ ప్రజానికంతో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం హర్షం వ్యక్తంచేస్తున్నారు.
దిశపై సామూహిక అత్యాచారం జరిపి, ఆమెను దారుణంగా హతమార్చిన ఘటన సైబరాబాద్ పరిధిలో చోటుచేసుకున్నప్పుడే ప్రజానికానికి అప్పటి వరంగల్ యాసిడ్ దాడి కేసు గుర్తుకొచ్చింది. ఎందుకంటే అప్పుడు ఆ కేసులో దర్యాప్తు అధికారిగా వరంగల్ ఎస్పీ హోదాలో ఉన్నది మరెవరో కాదు... ప్రస్తుతం సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ కావడమే.
దిశపై సామూహిక అత్యాచారం, దారుణ హత్యకు పాల్పడిన కేసులో నిందితులుగా ఉన్న నలుగురు పారిపోతుండగా సైబరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. దిశను ఎక్కడైతే అత్యాచారం, హత్య చేసి శవాన్ని దహనం చేశారో.. అక్కడే నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.