Charminar Police Station: కబ్జారాయుళ్ల స్టైలే వేరు.. ఇన్నాళ్లు సామాన్యుల స్థలాలు, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసే వాళ్లు ఇప్పుడు పోలీస్ స్టేషన్ స్థలంపైనే కన్నేశారు. స్టేషన్ వెనుకాలే ఉన్న పోలీస్ శాఖకు సంబంధించిన స్థలాన్ని యథేచ్ఛగా కబ్జాకు పాల్పడ్డారు. కబ్జా చేయడమే ఏకంగా రెండంతస్తుల నిర్మాణం చేపట్టారు. స్తాబ్ వేసే వరకు పోలీసులకు కబ్జా చేస్తున్నారనే విషయం తెలియకపోవడం గమనార్హం. పోలీస్ శాఖ గమనించే సరికి ఓ అంతస్తు నిర్మాణం పూర్తి కావడం గమనార్హం. ఆలస్యంగా మేల్కొన్న పోలీస్ శాఖ కబ్జారాయుళ్లు చేసిన పనికి నివ్వెరపోయారు. వెంటనే నిందితులపై కేసు నమోదు చేశారు. అయితే స్టేషన్ వెనుకాల తమ శాఖకు సంబంధించిన స్థలాన్ని కబ్జా చేస్తుంటే చూడకుండా పోలీస్ శాఖ ఉండడంపై ప్రజలకు విస్మయానికి గురి చేస్తోంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Yadadri Reels: మరో వివాదంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. యాదాద్రి ఆలయంలో రీల్స్, ఫొటోషూట్
హైదరాబాద్‌లో పోలీస్ శాఖకు కేసీఆర్ ప్రభుత్వం భారీగా అన్ని సౌకర్యాలు కల్పించడంతోపాటు కొత్త భవనాలు నిర్మించింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చార్మినార్ పెడిస్ట్రియన్ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా చార్మినార్ పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ స్థలం కొంత తీసుకోవాల్సి వచ్చింది. 2002లో రెవెన్యూ అధికారులు 840 గజాల ప్రభుత్వ స్థలాన్ని పర్యాటక శాఖకు ఇచ్చారు. అనంతరం ప్రభుత్వం పోలీస్ శాఖకు స్టేషన్ వెనుకాలే 840 గజాల స్థలాన్ని కేటాయించింది.
Also Read: KCR Astrology: మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారు రాసి పెట్టుకోండి.. జాతకం చెప్పిన ప్రముఖ జ్యోతిష్యుడు
కొత్త పోలీస్ స్టేషన్ భవనం నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించగా ఆ స్థలాన్ని ఇప్పుడు కొందరు స్థానికులు కబ్జా చేశారు. దాదాపు 200 గజాలపైన స్థలాన్ని కబ్జా చేసేసి భవన నిర్మాణం చేపట్టారు. ఒక స్లాబ్ వేసి భవనం నిర్మాణం చేస్తుండగా పోలీస్ శాఖ గుర్తించింది. వెంటనే విచారణ చేపట్టి కబ్జా చేసిన వారిని గుర్తించారు. మక్బూల్ అహ్మద్ మరో నలుగురు అక్రమంగా నిర్మాణం చేస్తున్నారని గుర్తించి వారిపై చార్మినార్ పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది.
పోలీస్ స్టేషన్ వెనకాలే స్లాబ్ వేసే వరకు పోలీసులు గుర్తించకపోవడం గమనార్హం. పోలీస్ స్థలంలో అక్రమంగా ప్రవేశించి కబ్జాకు పాల్పడుతుంటే పోలీస్ శాఖ ఏం చేస్తోందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. తమ శాఖకు సంబంధించిన స్థలాన్నే గుర్తించని పోలీస్ శాఖ ఇక సామాన్యుల కబ్జాలు, నిర్మాణాలు ఎలా గుర్తిస్తుందనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పాతబస్తీలో ఇలాంటి కబ్జాలు సర్వసాధారణమని.. వెంటనే సంబంధిత అధికారులు గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చాలా చోట్ల ప్రభుత్వ స్థలాలు ఇలాగే కబ్జాకు గురయ్యాయనే విషయాలను గుర్తు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Land Grab: పోలీసులకే షాక్ ఇచ్చిన కబ్జారాయుళ్లు.. చార్మినార్ స్టేషన్ స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణం