Bandi sanjay on Serious on ktr: కేంద్ర మంత్రి బండి సంజయ్ గ్రూప్ 1 ఉద్యోగులకు సంఘీ భావం తెలుపుతు అశోక్ నగర్ కు వెళ్లారు. విద్యార్థుల డిమాండ్ ల మేరకు గ్రూప్ 1 ఎగ్జామ్ ను వాయిదావేయాలన్నారు.
గ్రూప్ 1 ఎగ్జామ్ లను వాయిదా వేయాలని కూడా కూడా పెద్ద ఎత్తున అభ్యర్థులు అశోక్ నగర్ లో, గాంధీనగర్ లో తమ నిరసన తెలియజేస్తున్నారు.ఈ క్రమంలో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దీంతో భారీ సంఖ్యలో విద్యార్థులు రోడ్డు మీదకు వచ్చి ఎగ్జామ్ లను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.ఈ క్రమంలో శాంతియుతంగా రోడ్డు పైకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా.. పోలీసులు విద్యార్థులను పరిగెత్తించీ మరీ కొట్టినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ అశోక్ నగర్ కు చేరుకుని తమ విద్యార్థులకు అండగా నిలిచారు. విద్యార్థులతో కలసి ఛలో సెక్రెటరియట్ నిర్వహించారు. వందలాదిగా స్టూడెంట్స్ కేంద్ర మంత్రి వెంట ఉన్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం తలెత్తుతుందని పోలీసులు అదనపు బలగాలను మోహరించారు.
కేంద్రమంద్రి బండి సంజయ్ బీజేపీ ఆఫీస్ లో మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ సర్కారు ఈగోలకు పోకుండా.. గ్రూప్ 1 విద్యార్థుల డిమాండ్ మేరకు ఎగ్జామ్ లను వాయిదా వేయాలన్నారు. అంతే కాకుండా జీవో నంబర్ 29 ను రద్దు చేయాలన్నారు.
బండి సంజయ్ ఒక సీఐ మీద ఫైర్ అయ్యారు. అశోక్ నగర్ లో.. యువతిని హస్టల్ లో బ్లౌజ్ లను చింపి మరీ కొట్టారని తనకు కొంత మంది చెప్పారని అన్నారు. ఇది సరైన విధంగా కాదని, ఇలాంటి పనులు చేయోద్దని హెచ్చరించారు.
అదే విధంగా గ్రూప్స్ స్టూడెంట్స్ ల ధర్నాలో.. బీఆర్ఎస్ కుట్రకు పన్నిందన్నారు. కానీ విద్యార్థులు మాత్రం బీఆర్ఎస్ ను పరిగెత్తించిదన్నారు. బీజేపీ విద్యార్థులకు సంఘీభావంగా ఉండటం బీఆర్ఎస్ ఓర్చుకోలేదన్నారు.
అంతేకాకుండా.. గతంలో కేటీఆర్ తనపై చేసిన ఆరోపణలపై మండిపడ్డారు. కేటీఆర్ కు అధికారం పోయిన, అహాంకారం మాత్రం పోలేదన్నారు. కేటీఆర్ అమ్మవారి దగ్గరకు వచ్చి డ్రగ్స్ తీసుకొలేదని కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ప్రమాణంకు సిద్దమా అని సవాల్ విసిరారు.
కేటీఆర్ చీకటి బతుకేందో తనకు తెలుసని, బిచ్చపు బతుకని అన్నారు. కేటీఆర్, రేవంత్ రెడ్డిలు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైందన్నారు. చీకటి బతుకు చెబితే ఎక్కడ తిరగలేవని కేటీఆర్ కు బండి సంజయ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.