Kumbhakarana sword Video: రోజు రోజు టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతోంది. దీనికి తోడు ఏఐ కలవడంతో ఎలాంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు. అంతేకాకుండా కొత్త కొత్త ఫోటోస్, డీప్ ఫేక్ వీడియోలు కూడా పెరుగుతున్నాయి. దీని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు విపరీతంగా రెచ్చిపోతున్నారు. టెక్నాలజీని వినియోగించుకుని అన్ని మార్పింగ్ చేస్తున్నారు. ఇలా చేసిన మార్ఫింగ్ వీడియోస్‌తో పాటు ఫోట్స్ జనాల్లో వదులుతున్నారు.
మార్ఫింగ్ చేసిన ఫోటోస్‌ను సామాన్య జనాల్లోకి వదులుతున్నారు. అయితే చాలా మంది వీటిని నిజమని కూడా భావిస్తున్నారు. అయితే గతంలో కూడా ఈ మార్ఫింగ్ ఉండేది.. కానీ టెక్నాలజీ ఒక్కసారిగా పెరగడంతో మార్ఫింగ్ యాప్స్ కూడా పెరుగుతూ వస్తున్నాయి.
ఆర్టిఫిషియల్ టెక్నాలజీ పెరగడంతో మరిణించిన వారి కూడా వీడియోల రూపంలో బ్రతికిస్తున్నారు. అంతేకాకుండా వారితో మాట్లాడిస్తున్నారు. అలాగే డ్యాన్స్ స్టెప్పులు వేయిస్తున్నారు.
ప్రస్తుతం చాలా మంది కేటుగాళ్లు కోన్ని రకాల వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాను భ్రష్టు పట్టిస్తున్నారు. దీని కారణంగా నెటిజన్స్ ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇటీవలే ఇలాంటి ఓ వీడియో అందర్నీ ఆగం చేస్తోంది.
తాజా కుంభకర్ణుడికి సంబంధించిన ఓ పెద్ద కత్తి ఇటీవలే తవ్వకాల్లో లభించిందని.. ఇది రామాయణం నాటిదని, అప్పుడు కుంభకర్ణుడు ఇదే కత్తి వడారని కొన్ని ఫోట్స్తో పాటు వీడియోలను సోషల్ మీడియాలో వదిలారు.
ప్రస్తుతం ఈ కుంభకర్ణుడికి సంబంధించి కత్తి వీడియో తెగ వైరల్ అవుతోంది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఇది ఒక మార్ఫింగ్ వీడియోనని.. దీనిని కొంతమంది కావాలని ప్రచారం చేస్తున్నారట.
నిజానికి ఇది ఆ నాడు కుంభకర్ణుడు వినియోగించిన కత్తేనా అని చాలా మంచి ఫ్యాక్ట్ చెక్ చేస్తే తెలిందేంటంటే.. దీనిని AI వాడి వీడియోను.. కత్తిని తయారు చేశారట. అంతేకాకుండా గతంలో కూడా ఇలాంటి చాలా వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారట.