Liquor Bottle Price: మందుబాబులకు పండగే పండగ.. క్వార్టర్ బాటిల్‌ ధర కేవలం రూ.99 ఆ రోజు నుంచే అమలు..!

Quarter Liquor Bottle Price at 99 Rupees: ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రూ.99 క్వార్టర్‌ బాటిల్‌ ధరపై బిగ్‌ అప్డేట్‌ వచ్చేసింది. ఇప్పటికే కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం షాపుల్లో విక్రయాలు కూడా మొదలయ్యాయి. ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ నిషాంత్‌ కుమార్‌ దీనిపై క్లారిటీ ఇచ్చారు.
 

1 /5

ఇప్పటికే మద్యం తయారీ ప్రధాన ఐదు సంస్థలు రూ.99 కే క్వార్టర్‌ బాటిల్‌ ధరకు విక్రయించేందుకు ముందుకు వచ్చాయి. సోమవారం నాటికి 20 వేల కేసులు మార్కెట్లోకి రానున్నాయి.ఇప్పటికే పదివేల కేసులు చేరాయి.  

2 /5

ఏపీలో మద్యం విక్రయాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయాలు జరగనున్నాయి. కొత్త పాలసీ తీసుకువచ్చిన ఏపీ ప్రభుత్వం బుధవారం నుంచి విక్రయాలు కూడా ప్రారంభించింది. నెలఖరు నాటికి 2.40 లక్షల మద్యం కేసులు అందుబాటు ఉండనున్నాయి.  

3 /5

అయితే, రూ.99 కే క్వార్టర్‌ అందించే విషయంపై ఇంకా చర్చ సాగుతుందని ఏపీ ఎక్సైజ్‌ కమిషనర్‌ నిషాంత్‌ కమార్‌ చెప్పారు. ఇప్పటికే మందు బాబులు రూ.99 క్వార్టర్‌ పై ఆరా తీస్తున్నారు. ఇక అతి త్వరలోనే మందు బాబులకు గుడ్‌ న్యూస్‌ అందించనుంది ఏపీ ప్రభుత్వం.  

4 /5

ఇదిలా ఉండగా కొత్తగా మద్యం షాపులు దక్కించుకున్నవారికి కొత్త తలనొప్పి మొదలైంది. ఎక్కడ దుకాణాలు ఏర్పాటు చేయాలో గందరగోళంతో ఇంకా తెరవాల్సినవి ఉన్నాయి. నివాస ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే స్థానికులు మండిపడుతున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారు.   

5 /5

ఏపీ లిక్కర్‌ షాపులు టెండర్ వేసినప్పుటి నుంచి చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. మద్యం టెండర్ దక్కించుకున్నవారికి బెదిరింపులు, కిడ్నాప్‌లు ఒక్కోక్కరు లక్షలు ఖర్చుపెట్టి టెండర్‌ దక్కించుకోవడం వంటివి జరిగాయి. ఇప్పుడు షాపులు ఎక్కడ ఏర్పాటు చేయాలి అని వెతికే పనిలో నిమగ్నమయ్యారు. కొందరు తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసి విక్రయాలు చేస్తున్నారు.