Student Scheme: విద్యార్థులకు దీపావళి కానుక.. ఒక్కొక్కరి ఖాతాల్లో ఆ రోజే రూ.15,000 జమా చేస్తున్న ప్రభుత్వం..

Thalliki Vandanam Scheme: దీపావళి ముందే విద్యార్థులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం. ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15,000 జమా చేయనుంది. దీంతో పండుగ ముందే స్కూలు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు ఇది గుడ్‌న్యూస్‌. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికీ ఈ పథకం వర్తించనుంది. దీనిపై వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

Thalliki Vandanam Scheme: చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో తల్లికి వందనం పథకం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ స్కీమ్‌ అమలుకు కీలక అప్డేట్‌ ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా ఏపీలోని విద్యార్థులకు ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15,000 అందించనుంది.  

2 /5

తల్లికి వందనం పథకంలో భాగంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చదువుతున్న స్కూళ్లు, కాలేజీ విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం అమలుకు రూ.12 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.  

3 /5

అయితే, ఈ తల్లికి వందనం పథకం వచ్చే జనవరిలోనే అమలు చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో సంక్రాంతికి ముందు లేదా ఆ తర్వాత తల్లికి వందనం డబ్బులు విద్యార్థులకు అందించనుంది ఏపీ ప్రభుత్వం.  

4 /5

ఏపీ ప్రభుత్వం 2024 ఎన్నికల్లో భాగంగా సూపర్‌ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు, బడికి వెళ్లే విద్యార్థులకు ఏడాదికి రూ.15,000, మహిళలకు రూ.1500 చొప్పున అందిస్తామని చెప్పింది.  

5 /5

ఈ హామీలో భాగంగా మహిళలకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు త్వరలోనే అమలు చేయనుంది. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు. రూ.20 వేల లబ్ది చేకూర్చే అన్నదాత సుఖీభవ వచ్చే మార్చి లేదా ఏప్రిల్‌లో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.