/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Group 1 Mains Exam Postpone: పరీక్ష వాయిదా వేయాలని గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులు చేస్తున్న పోరాటానికి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ పూర్తి మద్దతు ప్రకటించారు. పరీక్షను వాయిదా వేయాలని కోరుతున్న అభ్యర్థుల డిమాండ్‌ను రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇలాగే మొండిగా రేవంత్‌ సర్కార్‌ ముందుకు వెళ్తే మొత్తానికే పరీక్ష రద్దయ్యే ఆస్కారం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వివాదాలన్నీ పరిష్కరించి పరీక్ష నిర్వహించాలని కేటీఆర్‌ కోరారు.

Also Read: KT Rama Rao: మనం వైఎస్సార్‌, చంద్రబాబుతో కొట్లాడినం.. చిట్టి నాయుడు ఎంత?

అభ్యర్థులే పరీక్షను వాయిదా వేయాలని కోరినప్పటికీ ప్రభుత్వం ఎందుకు మొండి పట్టుదలకు పోతోందని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. పరీక్షలు వాయిదా కోరుతూ అశోక్ నగర్‌లో ఆందోళన చేపట్టిన అభ్యర్థులను అరెస్ట్ చేయడాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ఖండించారు. అరెస్ట్‌ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని.. వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 

Also Read: Group 1 Mains: గ్రూప్‌ 1పై ముందుకే తెలంగాణ సర్కార్‌.. తగ్గేదెలే అంటున్న రేవంత్‌ రెడ్డి

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతున్న అభ్యర్థులతో గురువారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అభ్యర్థుల సమస్యలు తెలుసుకుని.. వారి డిమాండ్లను విన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థుల పోరాటానికి తాము అండగా ఉంటామని కేటీఆర్‌ మద్దతు ప్రకటించారు. అభ్యర్థుకు కావాల్సిన న్యాయ సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. 

ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 29 రాజ్యాంగ విరుద్ధంగా ఉందని ఈ సందర్భంగా కేటీఆర్‌ దృష్టికి అభ్యర్థులు తీసుకొచ్చారు. రిజర్వేషన్ల విషయంలోనూ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని వాపోయారు. గ్రూప్ 1 మెయిన్స్‌కు సంబంధించి దాదాపు 22 కేసులు కోర్టులో ఉన్నప్పటికీ ప్రభుత్వం మొండిగా పరీక్షలు నిర్వహించాలని చూస్తోందని తెలిపారు. తాము సుప్రీంకోర్టుకు వెళ్తే కోర్టు కచ్చితంగా ఎగ్జామ్స్ రద్దు చేస్తుందని చెప్పారు. రద్దయ్యే పరీక్షలు నిర్వహించడం సరికాదని చెబుతున్నప్పటికీ ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తుందని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయపరమైన సమస్యలన్నీ తీరిన తర్వాతే ఎగ్జామ్స్ నిర్వహించాలని కోరారు. పరీక్షలు వాయిదా వేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని హామీ ఇచ్చారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Section: 
English Title: 
Ex Minister KT Rama Rao Big Support To Group 1 Aspirants On Postpone Mains Exam Rv
News Source: 
Home Title: 

KTR: రేవంత్‌ రెడ్డి దుర్మార్గంగా వెళ్తే గ్రూప్‌ 1 మెయిన్స్‌ రద్దు.. కేటీఆర్‌తో అభ్యర్థుల ఆందోళన

KTR: రేవంత్‌ రెడ్డి దుర్మార్గంగా వెళ్తే గ్రూప్‌ 1 మెయిన్స్‌ రద్దు.. కేటీఆర్‌తో అభ్యర్థుల ఆందోళన
Caption: 
KT Rama Rao With Group 1 Mains Aspirants
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
రేవంత్‌ రెడ్డి దుర్మార్గంగా వెళ్తే గ్రూప్‌ 1 మెయిన్స్‌ రద్దు.. కేటీఆర్‌తో అభ్యర్థులు
Ravi Kumar Sargam
Publish Later: 
No
Publish At: 
Thursday, October 17, 2024 - 20:40
Created By: 
Ravi Kumar Sargam
Updated By: 
Ravi Kumar Sargam
Published By: 
Ravi Kumar Sargam
Request Count: 
17
Is Breaking News: 
No
Word Count: 
296