Ladki Bahin Yojana For Woman: మహిళలకు ప్రభుత్వం దీపావళి ఆఫర్ను ప్రకటించింది. వారి ఖాతాల్లో రూ.3 వేలు జమా చేస్తుంది. సంబంధిత అధికారులు 4, 5వ విడుత కలిపి రూ.3000 అర్హులైన మహిళల ఖాతాల్లో దీపావళి బోనస్ జమా చేయడానికి ఇప్పటికే లిస్ట్ కూడా తయారు చేసింది. ఈ పథకం వివరాలు ఏంటో తెలుసుకుందాం.
Ladki Bahin Yojana For Women: దీపావళి పండుగ మందు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. మహిళల ఖాతాల్లో రూ.3000 వారి ఖాతాల్లో జమా చేయడానికి లబ్దిదారుల జాబితా సిద్ధం చేసింది. ఆ పథకమే లడ్ఖీ బెహన్ యోజన. ఈ పథకం మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈసారి మొత్తం 4,5వ విడుత డబ్బులను జమా చేయనుంది.
మహిళలను ఆర్థికంగా ఆదుకోవడానికి ఉపాధి మార్గం చూపించడానికి మహా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. లడ్కీ బెహన్ యోజనను వారికోసం ప్రత్యేకించి ప్రారంభించింది. ఈ పథకంలో చేరడానికి 21 నుంచి 60 ఏళ్ల మహిళలు అర్హులు. లడ్ఖీ బెహన్ పథకంలో చేరడానికి కావాల్సిన ధృవపత్రాలు, అర్హత వివరాలు తెలుసుకుందాం.
మహా ప్రభుత్వం ప్రారంభించిన లడ్కీ బెహన్ పథకం ద్వారా అర్హులైన మహిళలకు ఆర్థిక సహాయం చేస్తుంది. ఈ పథకం ద్వారా రూ. 1500 నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమా చేస్తోంది. దీంతో వారు ఇతరులపై ఆధారపడకుండా ఉంటారు.
అర్హత.. మహారాష్ట్ర మహిళ అయి ఉండాలి. శాశ్వతంగా మహారాష్ట్ర ఇంటి ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి. వారి వయస్సు 21-65 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ పథకంలో పెళ్లి అయినవారు, కానివారు కూడా అర్హులు, విడాకులు తీసుకున్న మహిళలు కూడా ఈ పథకానికి అర్హులు. లడ్కీ బెహన్ పథకంలో చేరడానికి మహిళలకు బ్యాంకు ఖాతా కూడా ఉండాలి. వారి కుటుంబ ఆదాయం రూ. 2.5 లక్షలు మించకూడదు.
కావాల్సిన పత్రాలు.. ఆధార్ కార్డు, ఐడెంటిటీ సర్టిఫికేట్, బ్యాంక్ ఖాతా, కుల ధృవీకరఫ పత్రాం, వయస్సు ధృవీకరణ, రేషన్ కార్డు,పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆదాయ ధృవీకరణ పత్రం, డొమైసిల్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, ఓటర్ ఐడీ కూడా కలిగి ఉండాలి.
లడ్కీ బెహన్ పథకానికి దరఖాస్తు చేసుకునే విధానం.. లడ్కీ బెహన్ మహారాష్ట్ర పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. హోంపేజీలో లాగిన్ అవ్వాలి.
కొత్త పేజీలో కొత్త ఖాతా క్రియేట్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పేరు, పాస్వర్డ్, అడ్రస్ వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత సైన్ అప్ చేసుకుంటే పూర్తి అవుతుంది.