న్యూ ఢిల్లీ: దశాబ్ధాల పాటు అనేక చర్చలు, ఘర్షణలకు దారితీస్తూ సంచలనం సృష్టించిన అయోధ్య రామజన్మ భూమి-బాబ్రీ మసీదు స్థల వివాదంపై నేడు సుప్రీం కోర్టు చారిత్రక, సంచలనమైన తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయోధ్య స్థల వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించిన నేపథ్యంలో ఈ అంశంపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ... ఈ తీర్పు రాబోయే కాలంలో సమాజాన్ని మరింత ఐక్యమయ్యేలా చేస్తుందని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పును చారిత్రక తీర్పుగా అభివర్ణించిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ప్రతీ ఒక్కరు విశాల దృక్పథంతో వ్యవహరించి తీర్పును సమానంగా స్వీకరించాలని అన్నారు. అంతేకాకుండా అన్నివర్గాల వారు శాంతి, సామరస్యంతో మెలగాల్సిందిగా రాజ్‌నాథ్ సింగ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడుతూ రాజ్‌నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
The Judgment of Hon'ble Supreme Court on Ayodhya is historic. The Judgement will further strengthen India’s social fabric.
I urge everyone to take the verdict with equanimity and magnanimity. I also appeal to the people to maintain peace & harmony after this landmark verdict. pic.twitter.com/DWnVRPuXMG
— Rajnath Singh (@rajnathsingh) November 9, 2019
సుప్రీం తీర్పుపై స్పందించిన రాజ్‌నాథ్ సింగ్