2025 Tollywod Most Awaited Movies: 2025లో టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రాలు ఇవే..

2025 Tollywod Most Awaited Movies: 2025లో అపుడే చాలా చిత్రాలు రిలీజ్ డేట్ ప్రకటించుకున్నాయి. కొన్ని సినిమాల రిలీజ్ డేట్స్ పోస్ట్ పోన్ అయితే.. మరికొన్ని చిత్రాలు తన విడుదల తేదిని కన్ఫామ్ చేసుకున్నాయి. 2025లో తెలుగులో రాబోతున్న బిగ్ స్టార్ హీరోస్ సినిమాల విషయానికొస్తే..

 

1 /8

2025లో సంక్రాంతి నుంచి తెలుగులో బడా హీరోల చిత్రాల సందడి మొదలు కానుంది. గేమ్ ఛేంజర్ తో మొదలు కాబోతున్న ఈ సందడి వచ్చే స్వాతంత్య్ర దినోత్సవం వరకు రిలీజ్ డేట్స్ కన్ఫామ్ అయిన బడా హీరోల చిత్రాల విషయానికొస్తే..

2 /8

గేమ్ ఛేంజర్ (Game Changer) రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాను ఈ యేడాది చివర్లో విడుదల చేస్తున్నట్టు చెప్పినా.. విజయ దశమి సందర్బంగా జనవరి 10న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అదే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న విశ్వంభర మరో డేట్ కు పోస్ట్ అయింది.

3 /8

NBK 109 నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.  ఈ సినిమాకు ‘డాకూ మహారాజా’, ‘సర్కార్ సీతారామ్’ టైటిల్స్ పరిశీలిస్తున్నారు. ఏది ఫిక్స్ చేస్తారనేది దీపావళి రోజున తెలుస్తుంది.  

4 /8

సంక్రాంతికి వస్తున్నాము.. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాము’. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా   జనవరి 13న విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.

5 /8

హరి హర వీరమల్లు పార్ట్ - 1   ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం  ‘హరి హర వీరమల్లు’ పార్ట్ -1 సోర్డ్ వర్సెస్ స్పిరిట్.  ఈ సినిమాను మార్చి 28న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

6 /8

 ది రాజా సాబ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.  

7 /8

విశ్వంభర మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తూన్న ‘విశ్వంభర’ చిత్రాన్ని జవనరి 10న విడుదల చేస్తున్నట్టు ముందుగా ప్రకటించింది మెగాస్టారే. అయితే ‘గేమ్ ఛేంజర్’ మూవీ ఈ డేట్ లో విడుదల కోసం ఈ సినిమాను మే 9కు పోస్ట్ పోన్ చేశారు.

8 /8

వార్ 2 ‘దేవర పార్ట్ -1’ తర్వాత ఎన్టీఆర్ డైరెక్ట్ గా బాలీవుడ్ లో నటిస్తున్న చిత్రం ‘వార్ 2’. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగష్టు 14న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు.