Tata Salt company: రతన్ టాటా..ఈ పేరులో ఏదో తెలియని మమకారం దాగి ఉంది. ఈపేరు వెంటే చాలు మనస్సు పులకరించిపోతుంది. మాటల్లో చప్పలేని వ్యక్తిత్వం రతన్ టాటాది. ఇప్పుడు ఆయన మన మధ్య లేరు. 86ఏండ్ల వయస్సులో ఈ లోకాన్ని విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న రతన్ టాటా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ లోకాన్ని విడిచారు. టాటా గ్రూపును ఉన్నత శిఖరాలను తీసుకెళ్లిన రతన్ టాటా.. ప్రతి ఇంట్లోనూ ఉన్నారు. రతన్ టాటా సామాన్యులకు ఎన్నో పనులు చేశారు. నేటీకీ ప్రతి ఇంట్లో ఉండే టాటా సాల్ట్, టాటా టీ సజీవ సాక్ష్యాలు. దేశ ప్రజలు టాటా బ్రాండ్ ను ఎందుకంత విశ్వసించారో ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశం నేడు ఎంతో విలువైన రత్నాన్ని కోల్పోయింది. టాటాను గ్లోబల్ బ్రాండ్‌గా మార్చిన రతన్ టాటా ఇప్పుడు మన మధ్య లేకపోయినా ఆయన చేసిన సహకారాన్ని దేశం గుర్తు చేసుకుంటోంది. ఉప్పు నుండి టీ వరకు, కారు నుండి విమానం వరకు, సూది నుండి పెద్ద ట్రక్కు వరకు, వాచ్ నుండి AC వరకు. టాటా ప్రతిచోటా టాటా ఉనికి ఉంది. రతన్ టాటా స్వలాభం కోసం సామాన్య ప్రజల జీవితాలతో ఎప్పుడూ ఆడుకోలేదు. వ్యాపారంతో పాటు సామాన్యుల ఆరోగ్యం, అభిరుచుల పట్ల కూడా ఆయన ఎంతో శ్రద్ధ తీసుకున్నారు.
దేశంలో ప్రజలు అయెడిన్ లోపంతో బాధపడుతున్న రోజులు అవి. అయోడిన్ లోపం రకరకాల వ్యాధులు సంభవించాయి. ఎంతో మంది ప్రాణాలు సైతం కోల్పోయారు. చిన్న పిల్లల్లో సైతం అయోడిన్ లోపం వ్యాధులు వచ్చాయి. ఈ పరిస్థితులన్నింటిని చూసిన రతన్ టాటా ఈ సమస్యకు చెక్ పెట్టాలనుకున్నారు. వెంటనే అయోడిన్ తో ఉప్పును తయారు చేయాలని గుర్తించారు. ఉన్న ఫలంగా టాటా అయోడిన్ ఉప్పు కంపెనీ ప్రారంభించారు. రతన్ టాటా... టాటా కెమికల్స్ కంపెనీ 1983లో భారతదేశంలో మొట్టమొదటి ప్యాకేజ్డ్ అయోడైజ్డ్ సాల్ట్ బ్రాండ్‌ను ప్రారంభించింది. ఈ ఉప్పు ఇప్పటికీ ప్రజల హృదయాలను శాసిస్తుంది ప్రతి ఇంట్లో టాటా ఉప్పు మొదటి ఆప్షన్ గా ఉంటుంది. మన ముందు ఎన్నో బ్రాండ్స్ ఉప్పు ఉన్నప్పటికీ మనం ముందుగా ఎంచుకునేది టాటా ఉప్పు. ఎందుకంటే టాటా బ్రాండ్ పై సామాన్యుల్లో కలిగిన నమ్మకం అది.
టాటా గ్రూప్ దేశంలో ఉప్పు తయారీ పనిని 1927లో గుజరాత్‌లోని ఓఖాలో ప్రారంభించింది. గుజరాత్‌లో ఉప్పు తయారు చేయవచ్చని అప్పట్లో ఎవరూ ఊహించలేదు. కంపెనీ 1983లో ప్యాకెట్లలో అయోడైజ్డ్ ఉప్పును విక్రయించడం ప్రారంభించింది. ఈ ఉప్పు అతిపెద్ద లక్షణం ఏమిటంటే ఇది అయోడిన్ ఇనుము లోపాన్ని తొలగిస్తుంది. అంతేకాకుండా, ఈ ఉప్పు రక్తపోటును కూడా నియంత్రిస్తుంది.
నేడు, టాటా సాల్ట్ దేశంలో ఒకటి కంటే ఎక్కువ రకాల్లో అందుబాటులో ఉంది. ఇన్ని లక్షణాలతో నిండినప్పటికీ, ధరతో పోలిస్తే దీని ధర నామమాత్రమే. తక్కువ ధరకు ఉప్పు లభిస్తుందన్న కారణంగా ప్రజలు ఉప్పును ఉపయోగిస్తున్నారు. టాటా ఉప్పు తర్వాత టాటా గ్రూప్ కూడా టీ తయారీని ప్రారంభించింది. టాటా టీ వ్యాపారం కూడా భారతదేశంలోనే విజయవంతమైంది. ప్రజలు టాటా గ్రూప్ టీ తాగడానికి ఇష్టపడుతున్నారు. ఈ టీ పౌడర్ చిన్న ప్యాకెట్లలో సైతం అందుబాటులో ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి