Megastar Chiranjeevi: చిరంజీవి పెళ్లి ఆహ్వాన పత్రిక చూశారా..! 40 ఏళ్ల క్రితమే ఓ రేంజ్‌లో వెడ్డింగ్ కార్డ్ డిజైన్

Megastar Chiranjeevi Wedding Card: ఇటీవల మెగాస్టార్ చిరంజీవి పెళ్లి వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య కూతురు సురేఖను పెద్దల సమక్షంలో చిరంజీవి పెళ్లి చేసుకున్నారు. చిరంజీవిని సురేఖ అమ్మగారు చూడడం.. ఈ విషయాన్ని అల్లు రామలింగయ్యకు చెప్పడం.. ఆ తరువాత చిరంజీవిని ఒప్పించి పెళ్లి చేయడం చకచక జరిగిపోయాయి. మరి అప్పట్లో మెగాస్టార్ వెడ్డింగ్ కార్డు ఇప్పుడు సోషల్ తెగ వైరల్ అవుతోంది. మీరూ ఓ లుక్కేయండి.
 

1 /8

తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించిన దిగ్గజ నటుడు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి క్రేజ్ గురించి అప్పట్లోనే పాన్ ఇండియా వైడ్‌గా చర్చించుకునేవాళ్లు.  

2 /8

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ట తరం తరువాత మొదట చెప్పుకునేది మెగాస్టార్ చిరంజీవి గురించే. మన దేశంలో కోటి రూపాయల పారితోషికం అందుకున్న తొలి నటుడు మెగాస్టారే కావడం విశేషం.  

3 /8

69 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు పోటీ డ్యాన్స్‌లు, ఫైట్స్‌తో అలరిస్తున్నారు. వయసు పెరుగుతున్నా.. మెగాస్టార్‌లో మాత్రం గ్రేస్ తగ్గలేదు.  

4 /8

చిరంజీవి డ్యాన్స్‌ స్టెప్పులు ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కేలా చేశాయి. కొన్ని వందల పాటలకు తనదైన శైలిలో డ్యాన్స్‌తో అలరించారు.  

5 /8

అల్లు రామలింగయ్య కూతురు సురేఖకు మెగాస్టార్ చిరంజీవికి 1980 ఫిబ్రవరి 20న వివాహాం జరిగింది. అప్పట్లో చాలా బిజీ షెడ్యూల్ మధ్య కేవలం మూడు రోజులు షూటింగ్‌కు విరామం తీసుకుని పెళ్లి చేసుకున్నారు.  

6 /8

చిరంజీవి వెడ్డింగ్ కార్డు ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆహ్వాన పత్రికలో చిరంజీవి పెద్ద పూల మాల వేసి ఉన్న ఫోటోను ముద్రించారు.   

7 /8

40 ఏళ్ల క్రితమే మెగాస్టార్ డిజైన్ ఓ రేంజ్‌లో నెటిజన్లు అంటున్నారు. ఈ వెడ్డింగ్ కార్డును మెగా అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.  

8 /8

ఇక త్వరలో విశ్వంభర మూవీతో ఆడియన్స్ ముందుకు రానున్నారు మెగాస్టార్. మల్లిడి వశిష్ట దర్శకత్వంలో దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది.