హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె చేపట్టడంతో ప్రైవేటు వాహనాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా క్యాబ్ డ్రైవర్లు, ఆటోవాలాలు, ఇతర ట్రావెల్స్, టాక్సీ వాహనాల డ్రైవర్లకు ధరలు పెంచడానికి ఇదే సరైన సమయంగా మారింది. ఆర్టీసి సమ్మె కారణంగా రోడ్లపైకి పూర్తిస్థాయిలో బస్సులు రావడం లేదు. దీంతో మరో మార్గం లేని ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తుండటంతో.. వారు సైతం ధరలు పెంచి ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నారు. ఓవైపు స్వస్థలాల్లో పండగ జరుపుకుని నగరానికి తిరుగుప్రయాణమయ్యే వారు.. మరోవైపు నగరంలోనే అరకొర ఆర్టీసీ బస్సు సేవల మధ్యే ఉద్యోగాలకు వెళ్లే వారితో ప్రైవేటు వాహనాలు కళకళలాడుతున్నాయి.
హైదరాబాద్ రావడం వరకు ఒక ఎత్తైతే.. హైదరాబాద్‌కు చేరుకున్నాకా తమతమ ప్రాంతాలకు చేరుకోవడం మరో ఎత్తు అవుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. మొబైల్ యాప్ ద్వారా క్యాబ్ సేవలు అందిస్తున్న ఆపరేటర్స్ సైతం ఎప్పటికన్నా ఇంకాస్త ఎక్కువే వసూలు చేస్తూ అందినకాడికి సొమ్ము చేసుకుంటున్నాయంటున్నారు ప్రయాణికులు.
టాక్సీలు, క్యాబ్‌ల చార్జీల పెంపు