NTR about Devara : కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా నటించిన చిత్రం దేవర. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని ఎంతో అనుకున్నారు. కానీ సెక్యూరిటీ కారణంగా ఈవెంట్ ను.. క్యాన్సిల్ చేశారు. దాంతో ఈవెంట్ క్యాన్సిల్ అవడంతో అమెరికా వెళ్లిపోయిన ఎన్టీఆర్, ఇటీవలే ఇండియాకి వచ్చారు
ఇప్పుడైనా సక్సెస్ మీట్ నిర్వహిద్దామని అనుకుంటే.. ప్రభుత్వం నుంచి పర్మిషన్ రాలేదు. దీంతో ప్రైవేట్ గా టీంతో కలిసి సక్సెస్ పార్టీ చేసుకున్నారు ఎన్టీఆర్. ఇక ఇప్పుడు యాంకర్ సుమాతో కలిసి ఒక ఇంటర్వ్యూ చేశారు. "దేవర ప్రయాణం" అంటూ కొరటాల శివ, ఎన్టీఆర్ కలిసి ఈ సినిమా ముచ్చట్లు చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే ఆడియన్స్ కి కౌంటర్ ఇచ్చారు ఎన్టీఆర్.
ముఖ్యంగా జనాల మైండ్ సెట్ గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ.. అసలు ఎవరికి సొంత అభిప్రాయాలు లేవని ,ఎవరూ తమ అభిప్రాయాలను ధైర్యంగా, స్పష్టంగా చెప్పలేకపోతున్నారని అందరూ తూకాల ఇన్స్పెక్టర్ అయిపోయారు అంటూ కౌంటర్ ఇచ్చారు.
ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఈ సినిమాని విత్ మ్యూజిక్ వితౌట్ మ్యూజిక్ నేను కళ్యాణ్ అన్న చాలాసార్లు చూసాము. అయితే కళ్యాణ్ అన్న నా సినిమాకి ఫస్ట్ ఆడియన్ సినిమా చూసిన దగ్గరనుంచి అన్న బ్లాక్ బాస్టర్ అని ఒకటే మాట చెప్పుకొచ్చారు. నన్నయితే గట్టిగా హగ్ చేసుకుని అసలు వదిలిపెట్టలేదు. ఎలాంటి సినిమా తీశారో మీకు తెలియడం లేదు అంటూ కళ్యాణ్ అన్న అన్నారు. ఆ ఫీలింగ్ ఇప్పటికీ గుర్తుందని కొరటాల కూడా ఆరోజును గుర్తు చేసుకున్నారు.
ఇకపోతే జనాల మైండ్ సెట్ గురించి కూడా ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు..ప్రస్తుతం ప్రతిదీ కూడా జడ్జ్ చేసేస్తున్నాము. ప్రతిదానిని మనం విమర్శిస్తున్నాము. పిల్లల్లాగా మనం ఎందుకు సినిమా చూడడం లేదు. ఆ ఇన్నోసెన్స్ అందరిలో ఎందుకు మిస్ అవుతోంది. అందరూ తూకాల ఇన్స్పెక్టర్ ల లాగా ప్రతిదాన్ని విమర్శిస్తున్నామో తెలియదు. ఇది అక్కడ ఉండాలి.. ఇక్కడ ఉండాలని.. ఏదో కామెంట్ చేస్తున్నాం అంటూ, జనాల మైండ్ సెట్ చాలా మారిపోయిందని ఎన్టీఆర్ కామెంట్లు చేశారు.
మొత్తానికైతే ప్రస్తుతం నెగిటివిటీ సినిమాపై ఎక్కువ అయ్యింది. ఇంకొకరు ఎవరైనా సినిమా బాగుందని చెబితే మళ్లీ సినిమా చూడడం మొదలు పెడతారు. అప్పుడు అందరిలో పాజిటివ్ థాట్స్ వచ్చేస్తాయి. ఇది ఒక సైకిల్ లాగా జరుగుతుంది అని అభిప్రాయపడుతున్నాను అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.
"Innocence has died in people, and negativity has started increasing. People have begun judging very easily," says #JrNTR.#DEVARA pic.twitter.com/tZVWnxAFTZ
— Movies4u Official (@Movies4u_Officl) October 5, 2024
Also Read: Navratri 2024: దేవీ నవరాత్రుల్లో ఈ తప్పులు పొరపాటున కూడా చేయోద్దు.. పండితులు ఏమంటున్నారంటే..?..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.