Udhayanidhi Stalin Sanatana Dharma: తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో ఇద్దరు సినీ నటులు.. ఉప ముఖ్యమంత్రుల మధ్య రచ్చ మొదలైంది. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం మొదలైంది. సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అదే స్థాయిలో తాజాగా తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ వార్నింగ్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
Also Read: KVP Farm House: నా ఫామ్‌హౌస్ హైడ్రా పరిధిలో లేదు.. రేవంత్‌కు కాంగ్రెస్ సీనియర్ కేవీపీ కౌంటర్
తిరుపతిలో ప్రాయశ్చిత దీక్ష విరామం సందర్భంగా గురువారం జరిగిన 'వారాహీ సభ'లో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు ఇచ్చిన విషయం తెలిసిందే. గతంలో సనాతన ధర్మంపై ఉదయ నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై పవన్ స్పందిస్తూ తమిళంలో పవన్ మాట్లాడారు. 'సనాతన ధర్మాన్ని ఎవరూ తుడిచి పెట్టలేరు. ఎవరైనా అందుకు ప్రయత్నిస్తే వారే తుడిచిపెట్టుకుపోతారు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Konda Surekha: మళ్లీ కొండా సురేఖ నోటి దూల.. కేసీఆర్‌ను కేటీఆర్ హత్య చేశాడేమో
సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరన్న ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. ఆయన కారు ఎక్కేందుకు వెళ్తుండగా మీడియా ప్రతినిధులు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ప్రశ్నించారు. దానికి ఉదయనిధి స్పందిస్తూ ఓ చిన్న నవ్వు నవ్వారు. అనంతరం 'వెయిట్ అండ్ సీ' అని ఉదయనిధి సమాధానం ఇచ్చారు.
కాగా పవన్ వ్యాఖ్యలపై తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. అతడి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే డీఎంకే అధికార ప్రతినిధి సయ్యద్ హఫీజుల్లా స్పందిస్తూ.. 'డీఎంకే ఏ మతం గురించి.. ప్రత్యేకంగా హిందూ మతం గురించి మాట్లాడదు. కుల దురాఘాతాలు, అంటరానితనం వంటి వివక్షలకు వ్యతిరేకంగా మాట్లాడడం అనేది అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కొనసాగిస్తుంది' అని స్పష్టం చేశారు.
మతాన్ని హిందూ దేవుళ్లను రాజకీయ లబ్ధి కోసం బీజేపీ, టీడీపీ, పవన్ కల్యాణ్‌లు వాడుకుంటున్నారని సయ్యద్ హఫీజుల్లా ఆరోపించారు. సనాతన ధర్మానికి అసలైన శత్రువులు వారేనని చెప్పారు. పవన్ తన వ్యాఖ్యలతో ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter