Telangana Congress: కాంగ్రెస్ అంటేనే కలహాల పార్టీ అన్న పేరుంది.. ఈ పార్టీలోని నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగ్గా వ్యవహరిస్తుంటారు. ఎవరి దారి వారిదే అన్నట్టుగా నేతల తీరు ఉంటుంది. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా అదే రివాజు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్‌లో కూడా అది కొనసాగుతోందన్న టాక్ నడుస్తోంది.
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైడ్రాపై సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేక రాగం వినిపిస్తోంది. అటు మంత్రులు కూడా ఎవరికీ వారే ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. హైడ్రా తమ జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అల్టిమేటం ఇచ్చారు. ఇక మూసీ ప్రక్షాళన విషయంలో పేదల ఇళ్లపై గడ్డపారలు ఎలా దిగుతాయో చూస్తానంటూ మరో నేత మాజీ ఎంపీ మధు యాష్కీ హెచ్చరించడం కూడా పార్టీలో నేతల తీరును సూచిస్తుంది. ఇలా సొంతపార్టీ నేతలే ధిక్కార స్వరం వినిపిస్తుండటం విపక్ష పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ లకు అస్త్రాలుగా మారుతున్నాయి. దాంతో సెల్ఫ్ డిఫెన్స్‌లో రేవంత్ ప్రభుత్వం పడిందన్న చర్చ నడుస్తోంది.
ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!
ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..
హైడ్రా, మూసీ ప్రక్షాళనపై సామాన్యుడి నుంచి న్యాయస్థానం వరకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా మంత్రి కొండా సురేఖ సమంత అడ్డుపెట్టి కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలతో పాటు, సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. దీంతో అసలు కాంగ్రెస్ పార్టీకి ఏమైందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. మునుపటిలా నేతల వ్యవహారం లేదని ఇలాగే కొనసాగితే పార్టీ భవిష్యత్ అగమ్యగోచరమేనని టాక్ వినిపిస్తోంది.