Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం తప్పినా ఉపరితల ద్రోణి ఇంకా కొనసాగుతోంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల్లో మరోసారి వర్షసూచన జారీ అయింది. రానున్న48 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇక విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఏలూరు, కర్నూలు, కడప, అన్నమయ్య, చిత్తూరు, బాపట్ల గుంటూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.
ఇక ఏపీలో కూడా రానున్న 48 గంటల్లో తిరోగమన రుతు పవనాల ప్రబావంతో వర్షాలు పడనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి.
హైదరాబాద్ వాతావరణ శాఖ ఇప్పటికే తెలంగాణలోని 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి.
బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, మరి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది. ముఖ్యంగా నారాయణ పేట, జోగులాంబ గద్వాల్, మహబూబ్ నగర్, కర్నూలు, వనపర్తి, నారాయణ పేట్, మల్కాజ్ గిరి, వికారాబాద్, భువనగిరి, రంగారెడ్డి, జనగాం, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కొమురం భీం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.
ప్రస్తుతం దేశంలో నైరుతి రుతు పవనాలు తిరోగమిస్తున్నాయి. మరోవైపు సమద్రమట్టానికి 5.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఫలితంగా రానున్న 48 గంటల్లో ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు లేదా భారీ వర్షాలు పడవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ శాఖ చేసిన సూచనలు ఇవీ..