YSR Congress Party: అనూహ్యంగా బీసీ సంక్షేమ సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపింది. అయితే కృష్ణయ్యకు రాజ్యసభ పదవి ఇచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అతడి రాజీనామాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబు స్వార్థ.. డబ్బు రాజకీయాలకు ఆయన తలొగ్గారని విమర్శించింది. రాజీనామాతో బీసీలకు తీరని ద్రోహం చేశారని మండిపడింది.
Also Read: R Krishnaiah: మాజీ సీఎం వైఎస్ జగన్‌కు భారీ షాక్.. పిలిచి ఎంపీ పదవి ఇస్తే రాజీనామా
తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కారుమూరు నాగేశ్వరరావు మాట్లాడారు. 'చంద్రబాబు బేరసారాలకు, డబ్బు రాజకీయాలకు ఆర్.కృష్ణయ్య తలొగ్గడం బాధాకరం. ఒకచేత్తో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తూ, మరో చేత్తో ప్రతిపక్ష పార్టీకి చెందిన వారిని డబ్బుతో కొనుగోలు చేస్తూ చంద్రబాబు క్షుద్ర రాజకీయాలు చేస్తున్నాడు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడు.
Also Read: AP Nominated Posts: ఏపీలో 20 నామినేటెడ్ పోస్టుల భర్తీ.. సామాన్య కార్యకర్తలకు కీలక పదవీ..
'ఎంతో గౌరవించి బీసీల అభ్యున్నతికి పాటుపడతారనే ఆకాంక్షతో వైఎస్ జగన్ కృష్ణయ్యకు పదవి ఇచ్చారు. పార్టీలో ఎంతో మంది ఉన్నా కృష్ణయ్యకు ఇస్తే ఢిల్లీలో, పార్లమెంటులో బీసీల వాణి వినిపిస్తుందనే నమ్మకం.. విశ్వాసంతో రాజ్యసభ పదవిని కట్టబెట్టారు. ఉదాత్త సంకల్పాన్ని నీరుగారుస్తూ.. చంద్రబాబు తప్పుడు రాజకీయాలకు తలొగ్గి కృష్ణయ్య బీసీలకు తీరని ద్రోహం, నష్టం చేకూర్చారు' అని అనిల్, నాగేశ్వర రావు మండిపడ్డారు.
'చంద్రబాబు కొనుగోలు, కృష్ణయ్య రాజీనామా ఈ రెండు అంశాలను ప్రజలు గమనిస్తున్నారు. సమర్థ పాలన అందించలేక.. ఆ అంశాలను మరుగున పరచడానికి చంద్రబాబు ఇలాంటి ఎత్తుగడలు తీసుకుంటున్నారు. రాజీనామా చేసిన వారికి కొంత ఇచ్చి.. ఆ ఖాళీ అయిన సీట్లను పదిరెట్లకు చంద్రబాబు అమ్ముకుంటున్నాడు. చంద్రబాబుకు ఇదొక లాభసాటి వ్యాపారంగా మారింది. రాజకీయాల్లో బాబు నయా మార్కెటింగ్ వ్యవహారమిది' అని ఆరోపించారు.
'ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇలాంటి వాటికి కృష్ణయ్య తలొగ్గి రాజకీయంగా బీసీలకు తీరని ద్రోహం చేశారు. ఇలాంటి వ్యవహారాలతో వైఎస్సార్సీపీని బలహీనపర్చలేరు. అంతకుమించి రెట్టింపు స్పందనతో సమయం వచ్చినప్పుడు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారు' అని మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కారుమూరు నాగేశ్వరరావు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.