నల్గొండ: నాగార్జునసాగర్ డ్యామ్ నిండు కుండను తలపిస్తోంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం ఎత్తు 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 589.20 అడుగులకు చేరింది. ప్రస్తుత నీటిసామర్థ్యం 309.65 టీఎంసీలుగా ఉంది. దీంతో 8 గేట్లను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. ప్రస్తుతం నీటి ఇన్‌ఫ్లో 2.75లక్షలు కాగా ఔట్‌ఫ్లో 1.20లక్షల క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ గేట్లు ఎత్తడంతో సాగర్ అందాలను వీక్షించేందుకు వస్తోన్న పర్యాటకుల రద్దీ సైతం పెరుగుతోంది.
నిండు కుండలా నాగార్జున సాగర్.. 8 గేట్లు ఎత్తివేత