AP High Court Bench: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు

High Court Bench in Kurnool: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అదేవిధంగా అమరావతిలో 100 ఎకరాల్లో లీగల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జూనియర్ న్యాయవాదులకు రూ.10 వేల గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Sep 23, 2024, 05:12 PM IST
AP High Court Bench: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. కర్నూలులో  హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు

High Court Bench in Kurnool: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. బెంచ్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి పంపుతామని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేర‌కు కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. మంత్రివ‌ర్గ స‌మావేశంలో  ఈ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నట్లు ముఖ్యమంత్రి వెల్ల‌డించారు. సోమవారం సచివాలయంలో న్యాయ‌శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. రాజ‌ధాని అమరావతిలో 100 ఎకరాల విస్తీర్ణంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా ఇంటర్నేషన్ లా స్కూల్ ఏర్పాటును ముందుకు తీసుకువెళ్లాలని సీఎం సూచించారు. 

Also Read: 

బెంగుళూరుకు చెందిన నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, గోవాలోని ఇండియా ఇంట‌ర్నేష‌న‌ల్  యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల త‌ర‌హాలో అంతర్జాతీయ ప్ర‌మాణాల‌తో  కూడిన అత్యుత్త‌మ ఇనిస్టిట్యూట్ ను అమ‌రావ‌తిలో ఏర్పాటు చేసే ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌న్నారు. అదే విధంగా జూనియర్ న్యాయవాదులకు నెలకు గౌరవ వేతనం కింద రూ.10 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పామని...ఆ మేరకు చెల్లించేందుకు ప్రక్రియ ప్రారంభించాలని సీఎం అధికారలకు సూచించారు.  

జూనియర్ న్యాయవాదులకు శిక్ష‌ణ కేంద్రం కోసం అకాడమీ ఏర్పాటు అంశంపైనా కసరత్తు చేయాలని సూచించారు. అనంతరం ప్రాసిక్యూషన్ విభాగంపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. నమోదైన కేసులు, రుజువైన నేరాల అంశంలో శిక్షపడే శాతం పెరగాలని.. దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేసే పద్దతులను అవలంభించాలని సీఎం సూచించారు. తప్పు చేసిన వారికి శిక్ష పడుతుంది అనే నమ్మకం కలిగేలా ప్రాసిక్యూషన్ ఉండాలని సీఎం  అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడే విషయంలో లిటిగేషన్లు పెట్టాలే కానీ.. అనవసర వివాదాలు తెచ్చేలా లిటిగేషన్ ప్రభుత్వం నుంచి ఉండకూడదని సీఎం వ్యాఖ్యానించారు. న్యాయ‌ శాఖపై మరింత సమగ్రంగా సమీక్ష చేయాల్సి ఉందన్నముఖ్య‌మంత్రి.. మరిన్ని వివరాలతో రావాలని అధికారులను ఆదేశించారు.

Also Read: Rhea singha: గుజరాత్ భామను వరించిన మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. ఆమె గురించి ఈ విషయాలు తెలుసా..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News