Hyderabad: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ఢమాల్.. 42 శాతం ఇళ్ల అమ్మకాలు డౌన్.. ప్రాప్ ఈక్విటీ‌ బైటపెట్టిన విస్తుపోయే విషయాలు..

Hydra demolishes: హైదరబాద్ లో గత కొన్నినెలలుగా రిజిస్ట్రేషన్ లు భారీగా పడిపోయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇళ్లు,భూములు కొనే వారు తమ ఐడియాలను ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టుకున్నట్లు సమాచారం.  ఈ క్రమంలో ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ డాటా అనలిటిక్‌ సంస్థ ప్రాప్‌ఈక్విటీ షాకింగ్ విషయాలను వెల్లడించింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Sep 22, 2024, 08:45 PM IST
  • హైదరబాద్ లో పడిపోయిన రియల్ ఎస్టేట్ ..
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న జనాలు..
Hyderabad: హైదరాబాద్‌లో  రియల్ ఎస్టేట్ ఢమాల్.. 42 శాతం ఇళ్ల అమ్మకాలు డౌన్.. ప్రాప్ ఈక్విటీ‌ బైటపెట్టిన విస్తుపోయే విషయాలు..

Hydra effect on real estates in Hyderabad: కొన్నిరోజులుగా హైడ్రా నగర జీవుల్ని కంటి మీద కునుకులేకుండా చేసిందని చెప్పుకొవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కాన్సెప్ట్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనికి ఐపీఎస్ అధికారిని కమిషనర్ గా నియమించి, హైడ్రా అడిషినల్ పవర్స్ సైతం ఇచ్చారు . ప్రత్యేకంగా పోలీసులు, పోలీసు సిబ్బందిని సైతం కేటాయించారు. ఈ క్రమంలో హైడ్రా.. చెరువులు,ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి  నిర్మాణాలు చేపట్టిన వారికి కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఇప్పటికే వీకెండ్ వస్తుందంటే చాలు నగర వాసులు భయపడిపోతున్నారు.

 ముఖ్యంగా చెరువులు, నాలాలను ఆక్రమించి బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఇళ్లను నిర్మించిన వారికి మెయిన్ గా హైడ్రా చుక్కలు చూపిస్తుంది. ఇప్పటికే 160 కి పైగా అక్రమ నిర్మాణాల్ని కూల్చేసినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసిన తర్వాత హైడ్రా పేరు ఒక్కసారిగా దేశమంతటా మారిపోయిందని చెప్పుకొవచ్చు.

ఈ నేథ్యంలో ప్రస్తుతం హైడా ఎఫెక్ట్ వల్ల  ప్రభుత్వానికి ఎంత మేలు జరుగుతుందో కాస్త అటుంచితే , దీని వల్ల రియల్ ఎస్టేట్ రంగం మాత్రం కుదేలయ్యిందని చెప్పుకొవచ్చు.  మెయిన్ గా హైదరాబాద్ లో గత కొన్నినెలలుగా భారీగా రిజిస్ట్రేషన్ లను పడిపోయినట్లు ఇటీవల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా.. ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ డాటా అనలిటిక్‌ సంస్థ ప్రాప్‌ఈక్విటీ ఒక డాటాను విడుదల చేసింది. దేశంలోని 9 ప్రధాన నగరాల్లో ప్రస్తుత జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికం ఇండ్ల అమ్మకాలపై ప్రాప్‌ఈక్విటీ ఓ రిపోర్టును విడుదల చేసింది.

 దీని ప్రకారం 42 శాతం క్షీణతతో హైదరాబాద్‌ నగరం ముందు వరుసలో ఉంది. ఆ తర్వాత బెంగళూరు (26 శాతం), కోల్‌కతా (23 శాతం), పుణె (19 శాతం), చెన్నై (18 శాతం), ముంబై (17 శాతం), థానె (10 శాతం) ఉన్నాయి. ఇదిలా ఉండగా.. మొత్తం ఈ 9 నగరాల్లో ఈ జూలై-సెప్టెంబర్‌లో ఇండ్ల విక్రయాలు 1,04,393 యూనిట్లుగా ఉండొచ్చన్నది. నిరుడు ఇదే వ్యవధిలో 1,26,848 యూనిట్ల అమ్మకాలు జరిగినట్టు తెలుస్తోంది. దీంతో 18 శాతం పతనానికి అవకాశాలున్నట్టు ప్రాప్‌ఈక్విటీ తెలిపింది.

హైదరాబాద్‌లో ఈ జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఇండ్ల అమ్మకాలు 12,082 యూనిట్లుగా ఉండొచ్చని కూడా రియల్ ఎస్టేట్ ప్రాప్‌ఈక్విటీ వెల్లడించింది. గత ఏడాది ఇదే వ్యవధిలో 20,658 యూనిట్ల విక్రయాలు జరిగాయని వెల్లడించింది. తాజా సర్వేలో అన్ని నగరాల కంటే హైదరాబాద్‌లోనే అత్యంత క్షీణత కన్పిస్తుంది.

Read more: Viral video: ఇదేం పైత్యం.. బావి మీద కూర్చుని ఆ తల్లి ఏంచేస్తుందో తెలిస్తే.. చీపురు తిరగేస్తారు.. వీడియో వైరల్..

ముంబై, బెంగళూరు వంటి నగరాలనూ దాటుకొని గడిచిన పదేండ్లలో హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం దూసుకుపోయింది.  కానీ ఇప్పుడు పరిస్థితి దానికి భిన్నంగా మారింది. తాజగా, డాటా ప్రకారం.. హైదరాబాద్ లో కొత్తగా ఇళ్లు, స్థలాలు కొనేందుకు జనాలు జంకుతున్నట్లు తెలుస్తోంది.మరోవైపు ఇలానే కొనసాగితే.. కరోనాలాంటి పరిస్థితులు రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ కు రావొచ్చని కూడా ప్రచారం జరుగుతుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News