కేసీఆర్ రుణం తీర్చుకునే దిశగా జగన్ అడుగులు : యనమల సంచలన ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తే ..జగన్ అందుకు విరుద్ధంగా నడుచుకుంటున్నారని యనమల విమర్శించారు.

Last Updated : Aug 27, 2019, 01:22 PM IST
కేసీఆర్ రుణం తీర్చుకునే దిశగా జగన్ అడుగులు : యనమల సంచలన ఆరోపణలు

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ పరిపాలన తీరుపై టీడీపీ సీనియర్ నేత, మాజీ ఆర్ధిక మంత్రి యమనల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ విధానాలు చూస్తుంటే ఏపీ అభివృద్ధికి గండికొట్టడం విధంగా ఉన్నాయని దుయ్యబట్టారు. తీరు చూస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే అవకాశం కనిపించడం లేదన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధి కల్పన ఇలా అన్ని రంగాలకు సీఎం జగన్‌ తూట్లు పొడిచారని ఆరోపించారు. ప్రస్తుత ఆర్థిక మాంద్యానికి జగన్ రివర్స్ రూలింగ్‌ పాలనే కారణమని ధ్వజమెత్తారు. ఇది చాలదన్నట్లు రాజధాని తరలిస్తామంటూ రడగ చేస్తున్నారని యనమల విమర్శించారు.

జగన్ కావాలనే ఇలా చేస్తున్నారు ..
ఏపీ సర్వనాశనం కావాలన్నదే జగన్‌ స్వప్నమని టీడీనీ నేత యనమల మండిపడ్డారు. ఏదో రకంగా ఏపీ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి.. హైదరాబాద్‌లో ఎకానమీని పెంచడమే లక్ష్యమంగా జగన్ పనిచేస్తున్నారని విమర్శించారు. రాజధాని మార్పు అంశం కూడా అలాంటి కుట్రపూరిత ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందని టీడీపీ నేత యనమల ఘాటు విమర్శలు చేశారు. ఎన్నికల్లో కేసీఆర్ నుంచి లబ్దిన పొందిన జగన్... దానికి  రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఏపీలో ఇలా ఆర్థిక మాంద్యం సృష్టిస్తున్నారని టీడీపీ నేత యనమల విమర్శించారు.

బొత్స వ్యాఖ్యలు వెనుక జగన్ ...

రాజధాని అమరావతి విషయంలో మంత్రి బొత్స వ్యాఖ్యలను ఖండించిన యనమల ... ఇదంతా జగన్‌ ఆదేశాలతోనే ఆయన ఇలా వ్యాఖ్యనించారని విమర్శించారు. రాజధాని అమరావతి విషయంలో బొత్స తెర ముందుకు వచ్చి మాట్లడినప్పటికీ ..తెర వెనుక సీఎం జగన్ హస్తం ఉందని.. ముఖ్యమంత్రి ఆదేశాలతో బొత్స రాజధాని అమరావతిపై బురదజల్లే విధంగా మాట్లాడారని యనమల రామకృష్ణుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Trending News