Snake Charming Viral Video: సాధారణంగా పాములను చూస్తే హడలిపోతారు చాలా మంది. మరి కొంతమందికి చెమటలు పడుతాయి. కానీ ఈ వీడియో చూస్తే నోరు వెళ్లబెడతారు. ఏకంగా కింగ్ కోబ్రాను పట్టుకొని వాటిని ఏరిపడేస్తూ ఉన్న వీడియో ఒకటి నెట్టింట్ వైరల్‌గా మారింది. ఇంతకీ కింగ్ కోబ్రాలను ఎలా ఎందుకు ఏరిపడేస్తున్నడు అనే విషయాలు మనం తెలుసుకుందాం.
ఈ వీడియోలో ఒక వ్యక్తి గుంపుగా ఉన్న కింగ్ కోబ్రాల వద్దకు ఎంతో ధైర్యంగా లోపలికి దూసుకెళ్లాడు. ఒక చేతిలో గోని సంచిని పట్టుకొని పాములను పట్టుకోవడానికి వెళ్తుంటాడు. ఆ వ్యక్తిని చూసిన ఒక కింగ్ కోబ్రా బుసలు కొట్టగా ఆ వ్యక్తి ఎంతో సునాయాసంగా దానిని ఎత్తి విసురుతాడు. అక్కడితో ఆగకుండా కనిపించిన ప్రతి కోబ్రాను ఏరి ఏరి పక్కకు విసురుతుంటాడు. ఒక కింగ్ కోబ్రా అతిడిపై బుసలు కొట్టగా దాని తలపై మొట్టికాయ వేస్తాడు. ఈ వీడియో చూసిన జనం ఒక్కరిగా షాక్ కి గురయ్యారు. ఈ వీడియోను ఎక్స్ వేధికగా @crazyclipsonly షార్ చేశాడు. "స్నేక్ షో" కోసం కోబ్రాలను ఆ వ్యక్తి ఎంచుకుంటున్నాడు అని క్యాప్షన్ చేశాడు. ఈ వీడియోను చూసిన జనం ఎవడు మమ్మీ వీడు ఇంత వైలెంట్‌గా ఉన్నాడు అని కామెంట్స్ చేశారు. ఇంత వైలెంట్ గా ఉన్నాడు ఏంటి అని కొందరు షాక్ అయ్యారు.
Man selecting Cobras for the "snake show" pic.twitter.com/QHuGVREdLb
— Crazy Clips (@crazyclipsonly) November 30, 2023
సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో స్నేక్ షోలను పెట్టుతుంటారు. ఇందులో పాములను ప్రదర్శిస్తుంటారు. ఈ పదర్శనలో పాములను పట్టుకోవడం, వాటితో డాన్స్ చేయించడం వంటివి చేస్తుంటారు. ఇది మన భారతదేశం, దక్షిణాసియాలో చాలా మంది ఇలా పామలతో ప్రదర్శనలు చేస్తుంటారు. ఈ షో చూడడానికి వేలాది మంది ఖర్చు చేస్తుంటారు. పాములను పెట్టుకొనేవారు వాటితో డాన్స్ చేయించడం చూసిప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. మరికొందురు స్నేక్ షో చేసే వారు పాముల గురించి విశేషాలను చెప్పడం కూడా చేస్తారు.
స్నేక్ షోలలో ఎక్కువగా నాగపాములు, కోబ్రాలు వంటి విషపూరితమైన పాములను ఉపయోగిస్తారు. ఈ షోను ఎంతో జాగ్రత్తగా నిర్వహిస్తారు. ఒక చిన్న తప్పు జరిగిన ప్రాణాలకే ప్రమాదం. ఈ స్నేక్ పోలపైన ఇది వరకే ఎన్నో విమర్శలు వస్తున్నాయి. జంతు ప్రేమికలు ఈ షోలను ఖండించడం కూడా జరుగుతున్నాయి. షో పేరిట కొందరు పాములకు హింస కలిగిస్తాయి అని కూడా చాలా మంది చెబుతున్నారు. ఏదీ ఎలా ఉన్న స్నేక్ షో చూడాలనుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.