/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Ganesh Laddu Record: గణేష్ లడ్డూ వేలం పాట పూటకో రికార్డులు బ్రేక్ చేస్తుంది. ఎపుడు బాలాపూర్ లడ్డూ గురించి మాట్లాడుకునే జనాలు.. ఇపుడు వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న వేలంపాటల గురించి మాట్లాడుతున్నారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా దాదాపు 10 రోజులు పాటు పూజలందుకున్న లడ్డూను దక్కించుకుంటే కోరిక కోరికలు సిద్ధిస్తాయని ప్రతీతి. దీంతో శక్తి ఉన్న వారు ఈ వేలం పాటలో పాల్గొంటున్నారు. ఈ వేలంపాటలో ఎక్కువగా రియల్ ఎస్టేట్, రాజకీయ నాయకులు ఎక్కువగా ఉంటున్నారు. ఈ కోవలో 2024లో వేలంపాటలో బాలాపూర్ గణేషుడిని మించి బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విల్లాస్ లో నిర్వహించిన వేలంపాటలో లడ్డూ ధర ఏకంగా ఒక కోటి 87 లక్షలు పలకి ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు లక్షల్లో పలికిన గణేష్ లడ్డూ కోటి 87 లక్షలు దాటటం విశేషమనే చెప్పాలి. గతేడాది ఇక్కడ లడ్డూ ధర రూ. 1.20 కోట్లు పలికింది. ఈ సారి గతంలో కంటే ఎక్కువగా వేలం పాటలో ఈ లడ్డూ వేలంపాట సాగడం విశేషం. అయితే.. ఈ లడ్డూ దక్కించుకున్న భక్తుడి వివరాలు తెలియాల్సి ఉంది.

అనంత చతుర్దశి రోజున బొజ్జ గణపయ్య.. గంగమ్మ ఒడిని చేరకుంటారు. ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు.. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కొలువైన వినాయక విగ్రహాలను ఆయా సమీపంలో ఉన్న సముద్రం, నదులు, చెరువుల, వాగులు, కుంటల్లో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అటు హైదరాబాద్ లో ప్రతిష్ఠాత్మక ఖైరతాబాద్ బడా వినానాయకుడు గంగమ్మ ఒడిలో చేరుకోవడానికి బయలు దేరారు. దీంతో భక్తులు  ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడానికి భారీగా తరలి వచ్చారు. ఇప్పటికే ట్యాంక్ పరిసర ప్రాంతాలకు ప్రజలు చేరుకుంటారు. మధ్యాహ్నానికి భారీగా విగ్రహాలు నిమజ్జనం చేసే అవకాశాలున్నాయి. ముఖ్యంగా గణేష్ ఊరేగింపు.. బాలాపూర్ నుంచి మొదలై కేశవగిరి, ఇంజన్ బౌలి, ఆలియా బాద్, లాల్ దర్వాజా, శాలిబండ, చార్మినార్, అఫ్జల్ గంజ్,మోజంజాహీ మార్కెట్, ఆబిడ్స్ మీదుగా వినాయక సాగరానికి తరలి వెళ్లనున్నాయి.

ఇప్పటికే సిటీలో పలు చోట్ల ముందుగా వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసారు. కొందరు మంగళవారం సెంటిమెంట్ నేపథ్యంలో ముందు రోజే నిమజ్జనం చేసారు. మరికొందరు రేపు ఉదయం కూడా వినాయక విగ్రహాలను నిమర్జనం చేయనున్నారు. నిన్నటితో ప్రారంభమైన వినాయక నిమజ్జనం రేపటి వరకు కొనసాగనుంది. 

ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Section: 
English Title: 
laddu auction starts Hyderabad bandlaguda jagir ganesh laddu sold whoping prise 1 crore 87 lakhs ta
News Source: 
Home Title: 

Ganesh Laddu Record: హైదరాబాద్ లో గణేష్ లడ్డూ వేలంలో ఆల్ టైమ్ రికార్డు.. ఏకంగా రూ. 1.87 కోట్లు పలికిన లడ్డూ..

Ganesh Laddu Record: హైదరాబాద్ లో గణేష్ లడ్డూ వేలంలో ఆల్ టైమ్ రికార్డు.. ఏకంగా రూ. 1.87 కోట్లు పలికిన లడ్డూ..
Caption: 
Ganesh Laddu Auction (X/Source)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
హైదరాబాద్ లో గణేష్ లడ్డూ వేలంలో ఆల్ టైమ్ రికార్డు.. ఏకంగా రూ. 1.87 కోట్లు ..
TA Kiran Kumar
Publish Later: 
No
Publish At: 
Tuesday, September 17, 2024 - 08:31
Created By: 
Kiran Kumar
Updated By: 
Kiran Kumar
Published By: 
Kiran Kumar
Request Count: 
45
Is Breaking News: 
No
Word Count: 
299