YS Jagan Only MLA: ఒక పార్టీ అధినేత, ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించాడు. అలాంటి నాయకుడిని పట్టుకుని మంత్రి నారా లోకేశ్ కేవలం ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా సంబోధిస్తుండడం ఆశ్చర్యకరం. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాయిని తగ్గించి కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా పరిగణిస్తున్నారు. జగన్‌ను కేవలం ఒక ఎమ్మెల్యేగా గుర్తిస్తుండడంతో ఆయన పరపతిని పరోక్షంగా లోకేశ్ తగ్గిస్తున్నాడు. దీంతో కూటమి నాయకులు 'లోకేశ్ స్టైలే వేరు' అంటూ చర్చించుకుంటున్నారు.
Also Read: Chandrababu: వంద రోజుల చంద్రబాబు పాలన.. ఎమ్మెల్యేలకు భారీ షాక్ తగలనుందా?
తాజాగా మాజీ సీఎం జగన్, మంత్రి లోకేశ్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. వీటికి వైద్య విద్య కళాశాలల అంశం వివాదానికి దారి తీసింది. వైద్య విద్యను ప్రైవేటుపరం చేస్తున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ విమర్శనాస్త్రాలు సంధించారు. దీనికి బదులుగా విద్య, ఐటీ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేశ్ స్పందించారు. 'ఎక్స్' వేదికగా జగన్‌పై ప్రతి విమర్శలు చేశారు.
Also Read: IPS Officers: హీరోయిన్ కాదంబరి జేత్వాని బిగ్ ట్విస్ట్.. ముగ్గురు పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్
'ఏం చదివావో తెలియదు.. ఎక్కడ చదివావో అస్సలు తెలియదు. నువ్వు విద్య శాఖ గురించి లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది ఫేకు జగన్' అంటూ నారా లోకేశ్ ధ్వజమెత్తారు. 'కనీస అవగాహన లేకుండా రాత్రి ఆత్మలతో మాట్లాడి ఉదయం మీరు తీసుకున్న నిర్ణయం 1000 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పాలిట శాపంగా మారింది. సీబీఎస్ఈ విధానంలో పరీక్షలు రాయడానికి అవసరమైన సామర్థ్య పెంపు, ఉపాధ్యాయులకు ఎటువంటి శిక్షణ ఇవ్వకుండానే పరీక్షా విధానం మార్చడం వలన పదో తరగతి చదువుతున్న 75 వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది' అని లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు.
'ఆత్మలతో కాకుండా నిపుణులతో చర్చించి వచ్చే విద్య సంవత్సరం 6వ తరగతి నుంచే పరీక్షా విధానంలో మెల్లగా మార్పులు తీసుకొచ్చి సీబీఎస్ఈలో పరీక్షలు రాసేందుకు సిద్ధం చేస్తాం. గుడ్లు, చిక్కి, ఆఖరికి ఆయమ్మల జీతాలు కూడా బకాయి పెట్టిపోయిన కంసమామ అయిన మీరు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాను అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది' అని లోకేశ్ ఎద్దేవా చేశారు. 'అన్నట్టు మీరు అంత ఉద్దరిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గినట్టో సెలవివ్వండి' అని మాజీ సీఎం జగన్‌కు లోకేశ్ వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు.
ఏం చదివావో తెలియదు..ఎక్కడ చదివావో అస్సలు తెలియదు..నువ్వు విద్య శాఖ గురించి లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది ఫేకు జగన్! కనీస అవగాహన లేకుండా రాత్రి ఆత్మలతో మాట్లాడి ఉదయం
మీరు తీసుకున్న నిర్ణయం 1000 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పాలిట శాపంగా మారింది. సిబిఎస్ఈ విధానంలో… https://t.co/bMd4dvM9ou
— Lokesh Nara (@naralokesh) September 16, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook
YS Jagan vs Lokesh: మంత్రి నారా లోకేశ్ స్టైలే వేరు.. మాజీ సీఎం జగన్‌ను కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా పరిగణన