Old Persons: అమ్మనాన్నలను వందేళ్లు జీవించేందుకు ఈ చిట్కాలు పాటిద్దాం..

These Tips For Old Aged Person Health Tips: ముసలి వాళ్లయిన అమ్మనాన్నలు తరచూ అనారోగ్యం పడుతుంటారు. వారికి ఇలా చేస్తే వందేళ్లు మీ కళ్ల ముందు జీవిస్తారు. అమెరికా నివేదిక ప్రకారం..

Written by - Ravi Kumar Sargam | Last Updated : Sep 15, 2024, 03:03 PM IST
Old Persons: అమ్మనాన్నలను వందేళ్లు జీవించేందుకు ఈ చిట్కాలు పాటిద్దాం..

Old Aged Person Health: వయసు మీద పడిన వారు నడవలేకపోవడం సహజం. మోచిప్పలు అరిగిపోవడంతో వారు నడిచేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే నడిచే ప్రయత్నంలో వాళ్లు ఒక్కోసారి అదుపు తప్పి కిందపడిపోవడంతో మరణిస్తున్నారు కూడా. ఇది ఆందోళన కలిగించే విషయం. అమెరికాలో ఇలా అదుపు తప్పి కిందపడి మృతి చెందుతున్న వృద్ధుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే దానికి కారణాలు ఓ అధ్యయనం వివరించింది. ఈ జాగ్రత్తలు పాటిస్తే మన ఇంట్లోని పెద్దవాళ్లను సురక్షితంగా కాపాడుకోవచ్చు.

Also Read: Bhaskara Award: తెలంగాణలో 'భాస్కర అవార్డు'.. మంత్రి శ్రీధర్ బాబుకు కేటీఆర్‌ సిఫారసు

 

ఇంటికి పెద్దవాళ్లు ఉండడం ఒక అదృష్టం. వారి అనుభవం.. వారి ఆలోచనలు మన కుటుంబానికి రక్షగా నిలుస్తాయి. శారీరకంగా అలసిపోయిన వారి ఆలోచనలు మాత్రం మన సంక్షేమ కోసమే ఉంటాయి. అలాంటి వారిని కాపాడుకునే ప్రతి కుటుంబంపై ఉంది. అలాంటి వృద్ధులను ఒంటరిగా వదలకుండా కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అమెరికాలో చేసిన ఒక అధ్యయనం కొన్ని కారణాలు, పరిష్కారాలు సూచించింది.

Also Read: Cancer Symptoms: మీలో ఈ లక్షణాలున్నాయా, అయితే జాగ్రత్త కేన్సర్ ముప్పు ఉన్నట్టే

 

65 ఏళ్లు దాటిన తర్వాత ఈ కింద పనులు స్వయంగా లేదా ఎవరి సహాయం లేకుండా చేయకూడదు.
అవి

  • మెట్లు/నిచ్చెనలు ఎక్కడం
  • చాలా వేగంగా తిరగడం
  • మీ పాదాలపై వంగడం
  • నిలబడి ప్యాంటు ధరించడం
  • కూర్చున్న స్థానం నుంచి హఠాత్తుగా లేవడం
  • త్వరగా ఎడమ-కుడి తిరగడం
  • అకస్మాత్తుగా వెనక్కి తగ్గడం
  • బరువైన వస్తువులను ఎత్తడానికి వంగడం
  • అకస్మాత్తుగా మంచం నుంచి లేవడం
  • చాలా ఒత్తిడికి గురవడం

ఇక వృద్ధాప్యంలో వచ్చే 4 సాధారణ సమస్యలు 

  • ఆహారం గొంతులో ఇరుక్కుపోవడంతో ఉక్కిరిబిక్కిరవడం
  • తప్పు దిండును ఉపయోగించడం
  • కాళ్లు తిమ్మిర్లు రావడం
  • కాళ్లలో జలదరింపు

సహాయం చేస్తే వందేళ్లు

  1. తినేటప్పుడు ఊపిరి ఆగిపోవడం:
    ఆహారం గొంతులో ఇరుక్కున్న సమయంలో కొద్దిగా సహాయం చేయాలి. మీ చేతులు పైకెత్తడం మాత్రమే అవసరం. మీ చేతులను మీ తలపైకి పైకి లేపడంతో మీ గొంతులో ఇరుక్కున్న ఆహారం సహజంగా కిందకు వెళ్లిపోతుంది.
  2. తప్పు దిండు
    మేల్కొన్నప్పుడు కొన్నిసార్లు మీ మెడలో నొప్పి వస్తుంది. దిండు తప్పుగా ఉంటే ఏమి చేయాలి? మీరు మీ కాళ్లను మాత్రమే పైకి లేపాలి. ఆపై మీ కాలి వేళ్లను లాగండి. సవ్యదిశలో లేదా అపసవ్య దిశలో మసాజ్ చేయండి.
  3. కాళ్లలో తిమ్మిర్లు
    కాలులో తిమ్మిరి అనిపించినప్పుడు కుడి చేతిని పైకి లేపండి. కుడి కాలులో తిమ్మిరి ఉంటే ఎడమ చేతిని పైకి లేపండి. ఇలా చేస్తే ఉపశమనం పొందుతుంది.
  4. జలదరింపు
    ఎడమ పాదం జలదరించినప్పుడు మీ కుడి అరచేతిని మీ శక్తితో తిప్పండి. కుడి పాదం జలదరించినప్పుడు మీ శక్తితో మీ ఎడమ అరచేతిని తిప్పండి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News