Vande Bharat New Trains in AP Telangan: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు ఇండియన్ రైల్వేస్ నుంచి శుభవార్త. ఇప్పటికే పలు
వందేభారత్ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లో పరుగుల తీస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా మరో రెండు రైళ్లు కేటాయించింది ఇండియన్ రైల్వేస్. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ఈ రెండు రైళ్లను ఈ నెల 16న ప్రారంభించనున్నారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు మరో రెండు వందేభారత్ రైళ్లు రానున్నాయి. ఇందులో ఒకటి సికింద్రాబాద్ నుంచి నాగ్‌పూర్, రెండవది విశాఖపట్నం నుంచి దుర్గ్ మధ్య నడవనున్నాయి. సికింద్రాబాద్-నాగ్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభమైతే ఢిల్లీ తరువాత ఎక్కువ వందేభారత్ రైళ్లు నడిచే స్టేషన్‌గా సికింద్రాబాద్ నిలవనుంది. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి 4 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు తిరుగుతున్నాయి. ఇది ఐదవది. ఈ నెల 16వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రెండు రైళ్లను ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్-నాగ్‌పూర్, విశాఖపట్నం-దుర్గ్ మధ్య నడవనున్న ఈ రెండు వందేభారత్ రైళ్లు అత్యంత కీలకం కానున్నాయి. ఎందుకంటే ఈ మార్గాలు బిజీ లైన్స్‌గా పరిగణిస్తారు. అంటే ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది
ఈ నెల 16వ తేదీన నాగ్‌పూర్ నుంచి ప్రారంభమయ్యే వందేభారత్ రైలుకు సికింద్రాబాద్‌లో స్వాగతం పలికేందుకు రావల్సిందిగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఆహ్వానించామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ రెండు రైళ్ల టైమింగ్స్ అండ్ హాల్ట్ స్టేషన్ వివరాలు ఇలా ఉన్నాయి
సికింద్రాబాద్-నాగ్‌పూర్ వందేభారత్
578 కిలోమీటర్ల దూరాన్ని 7.20 గంటల్లో చేరుకుంటుంది. ఉదయం 5 గంటలకు నాగ్‌పూర్‌లో బయలుదేరి మద్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి అదే రోజు సికింద్రాబాద్ నుంచి మద్యాహ్నం 1 గంటకు బయలుదేరి రాత్రి 8.20 గంటలకు నాగ్‌పూర్ చేరుకుంటుంది. నాగ్‌పూర్ నుంచి సికింద్రాబాద్ వచ్చే క్రమంలో దారిలో రామగుండానికి ఉదంయ 9.08 గంటలకు, కాజీపేటకు 10.04 గంటలకు చేరుకుంటుంది. ఇక సికింద్రాబాద్ నుంచి నాగ్‌పూర్ వెళ్లే వందేభారత్ కాజీపేట్ స్టేషన్‌కు మద్యాహ్నం 2.18 గంటలు, రామగుండం 3.13 గంటలకు చేరుకుంటుంది. తెలంగాణలో సికింద్రాబాద్ కాకుండా రామగుండం, కాజీపేట హాల్ట్ స్టేషన్లు ఉన్నాయి. మహారాష్ట్రంలో నాగ్‌పూర్ మినహాయిస్తే సేవాగ్రామ్, చంద్రాపూర్, బల్హార్ష హాల్ట్ స్టేషన్లు ఉన్నాయి.
విశాఖపట్నం-దుర్గ్ వందేభారత్
565 కిలోమీటర్ల దూరాన్ని 8 గంటల్లో చేరుకుంటుంది. ఇది ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మీదుగా సాగుతుంది. దుర్గ్‌లో ఉదయం 5.45 గంటలకు ప్రారంభమై రాయపూర్ 6.08 గంటలకు, మహా సముంద్‌కు 6.38 గంటలకు, ఖరియా రోడ్ 7.15 గంటలకు, కాంతబంజి 8 గంటలకు, తిత్లా గఢ్ 8.30 గంటలకు, కేసింగా 8.45 గంటలకు, రాయగఢ్ 10.50 గంటలకు, విజయనగరం 12.35 గంటలకు చేరుకుంటుంది. మద్యాహ్నం 1.45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక విశాఖపట్నం నుంచి మద్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరి విజయనగరం 3.33 గంటలకు, దుర్గ్ స్టేషన్‌కు రాత్రి 10.50 గంటలకు చేరుకుంటుంది.
Also read: Monkey Pox Vaccine: మంకీపాక్స్ వ్యాక్సిన్ వచ్చేసింది, రెండు డోసులతో 82 శాతం ప్రభావం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.