7 Traits of Strong Women: చాలా విషయాల్లో మహిళలు పురుషుల కంటే స్ట్రాంగ్, తెలివిగలవాళ్లని రుజువైన పరిస్థితి ఉంది. అదే గతంలో అయితే మహిళ అంటే అందం లేదా వాయిస్ అంతే. ఈ రెండే అనేవారు. మహిళలంటే ఇప్పుడు షార్ప్ మెమరీ కలిగినవారుగా పరిగణించాల్సి వస్తుంది. ఈ లక్షణాలుండే మహిళలకు మానసికంగా చాలా స్ట్రాంగ్ అని చెప్పవచ్చు.
కష్టజీవులు మానసికంగా స్ట్రాంగ్ ఉండే మహిళలు ఓటమి అంగీకరించరు. లక్ష్యాన్ని సాధించేందుకు చాలా కష్టపడగలరు.
తమలో లోపాల్ని తెలుసుకోవడం షార్ప్ మైండ్ ఉండే మహిళలు తమ లోపాల్ని తెలుసుకోగలరు. వ్యక్తిగత ఎదుగుదల కోసం వాటిని సరిదిద్దుకుంటారు. లోపాల్ని స్వీకరిస్తారు.
మార్పును స్వీకరించడం మానసికంగా బలంగా ఉండే మహిళలు మార్పును చాలా ఈజీగా స్వీకరిస్తారు. చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటారు. అందుకే ఎలాంటి పరిస్థితినైనా ఎడ్జస్ట్ చేసుకుంటారు. కష్ట సమయంలో కూడా నెగ్గుకురాగలరు
ఇతరుల్ని అర్ధం చేసుకోవడం మానసికంగా స్ట్రాంగ్ ఉండే మహిళలు తమను తాము అర్ధం చేసుకోవడంతో పాటు ఇతరుల ఎమోషన్, పరిస్థితుల్ని కూడా అర్ధం చేసుకుంటారు. ఇలాంటి మహిళలు మనసు విప్పి మాట్లాడుతారు.
ఉద్వేగం నియంత్రణ షార్ప్ మైండ్ ఉండే మహిళలు ఎప్పుడూ ఎమోషన్ నియంత్రించుకుంటారు. ఎక్కువ కోపమైనా లేక ఎక్కువ ప్రేమ అయినా కంట్రోల్ చేసుకుంటారు. ఎమోషన్ నియంత్రణ ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రశాంతంగా ఉండగలుగుతారు.
ప్రొడక్టివిటీ మానసికంగా స్ట్రాంగ్ ఉండే మహిళలు తమ సమయాన్ని ప్రొడక్టివిటీ పెంచడంలో ఎక్కువగా ఉపయోగిస్తారు
కాన్ఫిడెన్స్ వాస్తవానికి మానసికంగా బలంగా ఉంటేనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. మానసికంగా స్ట్రాంగ్ లేనప్పుడు ఆ వ్యక్తిలో కాన్ఫిడెన్స్ ఉండనే ఉండదు. ఇతరులతో పోల్చుకోరు. తమను తాము చాలా ఇష్టపడతారు. మానసికంగా స్ట్రాంగ్ ఉండే మహిళలకు తమ సమర్ధత, తెలివితేటలపై నమ్మకం ఉంటుంది.