Ram Nagar Bunny: ఆటిట్యూర్ స్టార్ చంద్ర హాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రామ్ నగర్ బన్నీ’. తాజాగా ఈ చిత్రాన్ని దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) డైరెక్ట్ చేస్తున్నారు. అక్టోబర్ లో "రామ్ నగర్ బన్నీ" సినిమా రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ గ్రాండ్ ఈవెంట్ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో గ్రాంగ్ గా నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్ లో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి తన వంతు ఆర్థిక సహాయాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కి అందజేశారు హీరో చంద్రహాస్.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ..
ప్రభాకర్ నాకు మంచి మిత్రులు తెలిసివారు. ఆయన రామ్ నగర్ బన్నీ సినిమా గురించి చెప్పి నన్ను పిలిచారు. ఈ కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉందన్నారు. చంద్రహాస్ మా అమ్మాయి క్లాస్ మేట్. తెలంగాణలో వరద బాధితులను ఆదుకునేందుకు చంద్రహాస్ తన వంతు సహాయాన్ని అందించడం హ్యాపీగా ఉందన్నారు. .దటి సినిమాకు హీరోలు అంతగా ఆకట్టుకోరు. కానీ చంద్రహాస్ బాగున్నాడు. ఫస్ట్ లుక్, గ్లింప్స్ తో అట్రాక్ట్ చేస్తున్నాడు. అతన్ని రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా.
'ఆటిట్యూడ్ స్టార్' చంద్రహాస్ మాట్లాడుతూ - మా "రామ్ నగర్ బన్నీ" ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు. రెండేళ్ల క్రితం ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఆటిట్యూడ్ చూపిస్తున్నాడు అని కామెంట్స్ చేశారు. నేను సినిమాల్లో ఒకలా, బయట మరొకలా బిహేవ్ చేయను. నా మనసులో ఏముందో అదే మాట్లాడుతుంటాను . అది కొందరికి నచ్చలేదు. ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయాలనే కోరికతో హీరోగా మారాను. అందుకు మా అమ్మా నాన్నలు ఎంతో సపోర్ట్ చేశారు. మా నాన్న ప్రభాకర్ పేరు నిలబెట్టేలా కష్టపడతానన్నారు. నా ప్రతిభను నా సినిమాల రిజల్ట్ ద్వారానే తెలియజేయాలని భావిస్తున్నాను . ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నా. వాటిలో ఫస్ట్ మూవీగా రామ్ నగర్ బన్నీ మీ ముందుకు రాబోతోందన్నారు. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించాలిని కోరారు.
నటీనటులు - చంద్రహాస్, విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర, మురళీధర్, సలీమ్ ఫేకు, మధునందన్, సుజాత, విజయలక్ష్మి, సమీర్, లక్ష్మణ్ టేకుముడి, ప్రణయ్ గణపూర్, శివ, హృశికేష్ గజగౌని, తదితరులు నటించారు.
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.