Cm revanth reddy at Khairatabad mahaganesh first puja: దేశంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఊరువాడ, పల్లె, పట్నం అని తేడా లేకుండా ఎక్కడచూసిన కూడా గణపయ్యను అందమైన మండపాలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పూజకార్యక్రమాలు చేపట్టారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ లో ఖైరతాబాద్ ఈసారి అందంగా ముస్తాబయ్యాడు. సప్తముఖ గణేషుడి రూపంలో ఈసారి గణేషుడు భక్తులకు దర్శనం ఇస్తున్నాడు.
ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి.. తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ఖైరతాబాద్ గణపయ్యకు తొలిపూజ కార్యక్రమం నిర్వహించారు. వినాయక చవితి నేపథ్యంలో.. ఖైరతాబాద్ దగ్గర సీఎం రేవంత్ తొలిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ క్రమంలో తొలిపూజ కార్యక్రమంలో వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్యనేతలు కూడా హజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి పూజల అనంతం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి కార్యకలాపాలు నిర్వర్తిస్తోందన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత 70 ఏళ్లుగా నిర్వహించడం గర్వకారణమన్నారు. 1954 నుంచి 2024 వరకూ దేశం దృష్టిని ఆకర్షించే విధంగా వినాయక చవితిని నిర్వహించడం ఆసక్తికర పరిణామమని రేవంత్ అన్నారు. ఖైరతాబాద్ వినాయకుడు దేశంలో గొప్ప గుర్తింపు పొందడం మనకు గర్వకారణమన్నారు. ఈసారి సెప్టెంబర్ 7 న వినాయక చవితి, సెప్టెంబర్ 17 న నిమజ్జనం, అదే విధంగా ఖైరతాబాద్ గణపయ్యకు.. 70 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. సప్తముఖ మహా గణేషుడిని ఏర్పాటు చేశారు.
గణపయ్య ఆశీస్సులతో.. ప్రజలంతా సుఖసంతోషాలు, పాడిపంటలు, అన్నిరంగాలలో ముందుకు దూసుకువెళ్లాలని కూడా కోరుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో 1లక్షా 50 వేల విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఉచిత కరెంట్ కావాలని అడిగితే భక్తుల కోసం అందిస్తున్నామన్నారు. ఈ ఏడాది అనుకోకుండా అకాల వర్షాలు సంభవించాయన్నారు.
Read more: Snake in mouth Video: పామును నోట్లో పెట్టుకుని రీల్స్..కళ్లముందే షాకింగ్ ఘటన.. వీడియో వైరల్..
దేవుడి దయ వల్ల ప్రజలంతాల తొందరలోనే ఇబ్బందికర వాతావరణం నుంచి బైటపడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఖైరతాబాద్ కమిటీ శిల్పి రాజేంద్రన్ ను సీఎం రేవంత్ ప్రత్యేకంగా సన్మానించారు. కాంగ్రెస్ సర్కారు.. గణేష్ ఉత్సవాలని ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. గతంలో ఖైరతాబాద్ గణపయ్య దగ్గరకు.. పార్టీ అధ్యక్షుడిగా వచ్చానని.. ఇప్పుడు సీఎం హోదాలో స్వామి వారికి పూజలు నిర్వహించానని కూడా సీఎం రేవంత్ వెల్లడించారు.