Vinayaka Chaturthi 2024: హిందువులకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండగల్లో వినాయక చవితి ఒకటి. ఈ పండగ రోజు దేశవ్యాప్తంగా హిందువులంతా గణేషుడి విగ్రహాలకు ప్రత్యేకమైన పూజలు చేసి ఉపవాసాలు పాటిస్తారు. ఈ సంవత్సరం వినాయ చవితి సెప్టెంబర్ 7వ తేదిన వచ్చింది. అయితే ఇంతటి ప్రాముఖ్య కలిగిన పండగ రోజు తప్పకుండా కొన్ని పనులు చేయడం వల్ల వినాయకుడి అనుగ్రహం లభిస్తుందని హిందువుల నమ్మకం. అయితే ఈ పండగ రోజు ఎలాంటి పనులు చేయడం శుభప్రదమో ఇప్పుడు తెలుసుకోండి.
వినాయక చవితి రోజు ఉదయం తొలి నిద్ర లేచి, స్నానం చేసి మడి కట్టుకుని ఇంటిలోని గుడిని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది దైవాన్ని ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నట్లు సూచిస్తుంది.
వినాయక చవితి రోజు ఉపవాసం ఉండడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల జీవితంలో ఎలాంటి ఆటంకాలు కూడా సులభంగా తొలగిపోతాయి. అంతేకాకుండా కుటుంబంలో సంతోషం కూడా పెరుగుతుంది.
వినాయకునికి ఇష్టమైన మోదకాలు, ఉండ్రాళ్ళు, పండ్లు వంటివి నైవేద్యంగా తప్పకుండా సమర్పించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల సులభంగా వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది.
మట్టితో తయారు చేసిన వినాయకుని విగ్రహాన్ని పూజించడం, ప్రత్యేకమైన పూల దండలు వేయడం, దీపాలు, నైవేద్యాలు సమర్పించడం చాలా ముఖ్యమని హిందూ పురాణాల్లో క్లుపంగా వెల్లడించారు.
వినాయ చవితి రోజు "ఓం గం గణపతయే నమః" గణపతి మంత్రాలను జపించడం మానసిక సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఆటంకాలు కూడా తొలగిపోతాయి.
వినాయక చవితి రోజు పేదలకు ఆహారం, బట్టలు వంటివి దానం చేయడం జీవితంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి.