Uttar Pradesh Woman molested ambulance: మహిళల భధ్రత ప్రస్తుతం దేశంలో గాలిలో దీపంలా మారిందని చెప్పుకొవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ఎన్ని చట్టాలు తీసుకున్న కొంత మంది తమ బుద్దిని మార్చుకొవడంలేదు. గుడి, బడి, బస్టాండ్, రైల్వేస్టేషన్.. ఇలా ప్రతిచోట మహిళలు వేధింపులకు గురౌతున్నారు. చివరకు తోడబుట్టిన వారు సైతం.. తమ వారిని వేధింపులకు గురిచేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం.. కోల్ కతా ఘటన దేశంలో ఇప్పటికే కుదిపేస్తుంది. ఇప్పటికి కూడా పలు చోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. దీనిపైన దేశ ప్రధాని మోదీ,రాష్ట్రపతి ద్రౌపదిముర్ము కూడా తమ ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీమ్ కోర్టు సైతం రంగంలోకి దిగి ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. ఈ క్రమంలో.. ఉత్తర ప్రదేశ్ లో మరో షాకింగ్ ఘటన ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది.
పూర్తి వివరాలు..
ఉత్తర ప్రదేశ్ లోని ఘాజీపూర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సిద్దార్థనగర్ లో ఒక మహిళ అంబులెన్స్ లో లైంగిక వేధింపులకు గురైంది. ఈ ఘటన ప్రస్తుతం పెనుదుమారంగా మారింది. సిద్ధార్థనగర్ జిల్లాలో.. ఒక మహిళ తన భర్తకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో..స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లింది. అప్పుడు.. ఆమె భర్త ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల.. స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఖర్చులు ఎక్కువగా మారడంతో మరో ఆస్పత్రికి వెళ్లేందుకు అంబులెన్స్ లో బయలు దేరారు. అప్పటికే రాత్రి వేళ అయ్యింది.
అయితే.. రాత్రిపూట మహిళతో పాటు.. ఆమె సోదరుడు కూడా ఉన్నాడు. భర్తకు ఆక్సిజన్ మాస్క్ పెట్టారు. ఈ ఘటన ఆగస్టు 30 న జరిగిట్లు తెలుస్తోంది. మహిళలను అంబులెన్స్ డ్రైవర్ ముందుకు వచ్చి కూర్చొమన్నాడు. రాత్రిపూట వెహికిల్ లో మహిళ ఉంటే.. పోలీసులు అడ్డుకొరని డ్రైవర్ చెప్పాడు. దీంతో మహిళ ముందుకొచ్చి కూర్చుంది.
ఇదే అదనుగా భావించి.. సహాయకుడు, డ్రైవర్ రాత్రిపూట అంబులెన్స్ ఆపిఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీంతో ఆమె ప్రతిఘటించడంతో.. వారు కొట్టినట్లు తెలుస్తోంది. మహిళ, ఆమె సోదరుడు గట్టిగా కేకలు వేయడంతో.. ఆమె భర్తను ఆక్సిజన్ మాస్క్ తీసేసి.. అంబులెన్స్ నుంచి తొసేసి వెళ్లిపోయారు. దీంతో ఆ రాత్రివేళ మహిళ.. డయల్ 100, 112 లకు కాల్ చేసింది. దీంతో అంబులెన్స్ సిబ్బంది, వైద్యులు అక్కడికి చేరుకుని బాధితుడ్ని ఆస్పత్రికి తరలించారు.
కానీ అతను మాత్రం.. చికిత్స పొందుతూ చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన మాత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంబులెన్స్ డ్రైవర్‌ను, అతని సహాయకుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు ఎలాంటి ప్రయత్నం చేయలేదని బాధితురాలు ఆరోపించింది. ఈ విషయమై ఆమె లక్నోలోని ఘాజీపూర్ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.
Read more: Koneti adimulam: అడ్డంగా దొరికి పోయిన ఎమ్మెల్యే ఆదిమూలం.. వైరల్ గా మారిన రాసలీలల వీడియో..
ఈ నేపథ్యంలో.. కేసు నమోదు చేసుకున్న లక్నో నార్త్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేంద్ర దూబే దీనిపై విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. అంబులెన్స్ డ్రైవర్ తన వద్ద డబ్బులు, నగలను కూడా దొంగిలించాడని ఆమె ఆరోపించింది. ఈ ఘటన ప్రస్తుతం దేశంతో మరోసారి సంచలనంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.