Bigg Boss Telugu 8 Day 1 Episode: బుల్లితెర ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 ఎట్టకేలకు ప్రారంభం అయ్యింది. ఎవరి అంచనాలకు అందని విధంగా.. ఈ కొత్త సీజన్ మొదలైంది. ముఖ్యంగా గత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్ ఉండబోతుందని ఇదివరకే మనం చూసిన ప్రోమోల ద్వారా అర్థమయింది. అయితే ఎప్పటిలాగే కంటెస్టెంట్ లను ఒంటరిగా కాకుండా జంటలుగా పంపించి కొత్తదనానికి నాంది పలికారు. ఇక సీజన్ 8 మొత్తం కెప్టెన్ లేకుండానే కొనసాగుతుందని చెప్పి పెద్ద షాక్ ఇచ్చాడు బిగ్ బాస్.
ఇకపోతే బిగ్ బాస్ అంటేనే గొడవలు, ప్రేమలు, కేరింగ్, అసూయ ఇలా ఎన్నో కలగలిపిన సీజనే బిగ్ బాస్. ఇక అలా హౌస్ లో.. కంటెస్టెంట్ల మధ్య జరిగే గొడవ ఆడియన్స్ ను.. మరింత మెప్పిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే హౌస్ లోకి అలా అడుగుపెట్టారో లేదో అప్పుడే మొదటి రోజే బిగ్ బాస్ హౌస్ లో ఫైటింగ్ మొదలైనట్టు తెలుస్తోంది.
తాజాగా మొదటి ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో విడుదల చేయగా.. అందులో నిఖిల్ , నాగ మణికంఠ మధ్య ఏదో గొడవ జరిగినట్లు చూపించారు. ఇందులో నాగ మణికంఠ మాట్లాడుతూ.. నీ వల్ల ఇష్యూ పెద్దదవుతోంది అని చెబుతూ ఉండగా.. నా వల్ల అయితే వదిలేయ్ అంటూ నిఖిల్ చెప్పడం ప్రోమోలో మనం చూడవచ్చు.
దీన్ని బట్టి చూస్తే మొదటి రోజే.. ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు కనిపిస్తోంది. అయితే ఇది నిజం కాదని బిగ్ బాస్ తన గేమ్ అప్పుడే మొదలు పెట్టారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతూ ఉండడం గమనార్హం. ఎప్పటి మాదిరిగానే టీవీ సీరియల్స్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు కంటెస్టెంట్లను చూస్తే మనకు అర్థమవుతోంది.
ఇకపోతే ఈ సీజన్లో మొదటి కంటెస్టెంట్ గా యష్మీ గౌడ రాగా, రెండవ కంటెస్టెంట్ నిఖిల్, అభయ్ నవీన్, ప్రేరణ, ఆదిత్య ఓం, సోనియా, బెజవాడ బేబక్క, ఆర్ జె శేఖర్ బాషా , సీత, నాగమణికంఠ , పృధ్విరాజ్ , విష్ణు ప్రియ, నైనిక, ఆఫ్రిది ఇలా మొత్తం 14 మంది హౌస్ లోకి అడుగుపెట్టారు.
Also Read: YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై మాజీ సీఎం జగన్ అలర్ట్.. వైసీపీ శ్రేణులకు కీలక సూచన
Also Read: Trains Cancelled: కుండపోత వర్షాలు.. ఆంధ్రపదేశ్‌లో భారీగా రైళ్లు రద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.