Heavy Rains: విజయవాడలో కుండపోత..ఇంద్రకీలాద్రిపై విరిగిపడ్డ కొండచరియలు ఏడుగురు మృతి

Vijayawada Rains: విజయవాడలో కుండపోత వాన కురుస్తోంది. భారీగా కురుస్తున్న వర్షాలతో నగరం అల్లకల్లోలంగా మారింది. శనివారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ముందస్తు చర్యల్లో భాగంగా ఘాట్ రోడ్డును అధికారులు మూసివేయడంతో...భారీ ప్రమాదం తప్పింది. భారీ వర్షాలకు ఏడుగురు మరణించారు. 

Written by - Bhoomi | Last Updated : Aug 31, 2024, 07:00 PM IST
Heavy Rains: విజయవాడలో కుండపోత..ఇంద్రకీలాద్రిపై విరిగిపడ్డ కొండచరియలు ఏడుగురు మృతి

Heavy Rains In Vijayawada : బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను అనుకుని ఉన్న తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం ఇంకా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో గత రాత్రి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇవాళ విజయవాడలో కుండపోత వాన కురిసింది. విద్యాధరపురం, ఆర్ ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్ స్టాండ్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపించాయి. రూడ్లపైకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. నగరం మొత్తం  కూడా వరద నీటితో నిండిపోయింది. 

ఇక ప్రముఖ ఇంద్రకీలాద్రి గుట్టపై కొండచరియలు విరిగిపడ్డాయి. కొండపై ఉన్న ప్రోటోకాల్ రూమ్ పై భారీ బండరాళ్లు పడ్డాయి. అయితే అధికారులు భారీ వర్షాల నేపథ్యంలో ఘాట్ రోడ్డును ముందస్తుగా మూసివేయించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాలతో ఇంద్రకీలాద్రి చుట్టుపక్కల ఉన్న ఇండ్లపై కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ ఘనలో మరణించిన వారి సంఖ్య ఏడుకి చేరింది. ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నక్రమంలో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇంద్రకీలాద్రిపై నివసిస్తున్న వారిని ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు. 

Read Also : Savings Rules : 50-30-20 ఫార్ములాతో ఇలా ఇన్వెస్ట్ చేస్తే.. జీవితంలో జేబు ఖాళీ అయ్యే పరిస్థితి రమ్మన్నా రాదు..ఎలాగంటే..?  

ఈ ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించివారి కుటుంబాలకు రూ. 5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలంటూ అధికారులను ఆదేశించారు.  కుండపోత వర్షాలతో విజయవాడ నగరం మొత్తం వరదలు పొంగిపొర్లుతున్నాయి. విజయవాడ బస్టాండ్ పరిసర ప్రాంతాలు మొత్తం నీట మునిగాయి. స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచింది. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కింద భారీగా వర్షపు నీరు చేరడంతో జాతీయ రహదారిపై వాహన రాకపోకలకు తీవ్ర అడ్డంకిగా మారింది.  

Read Also :Andhra Pradesh Rains Live: ఏపీలో కుంభవృష్టి.. భారీ వర్షాలతో విజయవాడ, గుంటూరు అతలాకుతలం    

భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులలో కంట్రోల్ రూములను ఏర్పాటు చేశారు. కలెక్టర్ స్రుజన ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వర్షం తగ్గే వరకు ప్రజలు బయటకు రావద్దంటూ సూచిస్తున్నారు. 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

Trending News