Heavy Rains: మూడు రోజులు కుండపోత వానలు.. తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ..

Heavy Rains: ఏపీ,  తెలంగాణ రాష్ట్రాలపై వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. మధ్యలో వరుణుడు కాస్త గ్యాప్ ఇచ్చిన మళ్లీ విజృంభిస్తున్నాడు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు పాటు కుండపోత వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 30, 2024, 10:56 AM IST
Heavy Rains: మూడు రోజులు కుండపోత వానలు.. తెలుగు రాష్ట్రాలకు ఎల్లో  అలర్ట్ జారీ..

Heavy Rains:  తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో రాబోయే మూడు రోజులు పాటు కుండపోత వానలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో గురువారం ఏర్పడిన అల్పపీడనం నేడు మరింత బలపడనుందని అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు పయనిస్తూ రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.  ఈ ప్రభావంతో శుక్ర, శనివారాల్లో ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అయితే దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నాయి.

ఈ అల్పపీడనం ప్రభావంతో ఆదివారం వరకు సముద్ర తీర ప్రాంతంలో అలజడ ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. సముద్రం అలజడిగా ఉంటుంది కాబట్టి.. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. కోస్తా తీరం వెంబడి గంటకు 44 నుంచి 55 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశాలున్నాయంటున్నారు.  భారీ వర్షాలు కురుస్తుండటంతో అత్యవసర సహాయం కోసం 1070, 112, 18004250101 నంబర్లలో సంప్రదించాలన్నారు.

మరోవైపు ఈ రోజు అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయన్నారు.  శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులు సూచించారు.

అటు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 11 జిల్లాల్లో మూడు రోజులు పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతేకాదు వర్షం పడే జిల్లాలకు ఆరెంజ్ రంగు హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు పసుపు రంగు(ఓ మోస్తరు వర్షం) అలర్ట్ జారీ చేసింది.  తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి శుక్రవారం వాయవ్య దిశలో కేంద్రీకృతం అయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం నాటికి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా వైపు కదిలే క్రమంలో బలపడి వాయుగుండంగా మారవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
 
భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే జిల్లాలు

    30.8.2024: మంచిర్యాల, జగిత్యాల, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
    31.8.2024: జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ.
    1.9.2024: నిజామాబాద్, జగిత్యాల, రాజకన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మెదక్, కామారెడ్డిలలో భారీ నుంచి అతి భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

ఇదీ చదవండి:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..

ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News