Trinamool mamata Banerjee post on Kolkata victim: కోల్ కతా జూనియర్ డాక్టర్ ఘటన దేశంలో పెనుసంచలనంగా మారింది. దీనిపై ఇప్పటికి కూడా నిరసనలు మిన్నంటాయి. ఇదిలా ఉండగా.. ట్రైనీ డాక్టర్ పై హత్యచారంకు నిరసనగా కోల్ కతాలో విద్యార్థులు చేపట్టిన నిరసనలు కాస్త రచ్చగా మారాయి. నబన్న అభియాన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలను పోలీసులు అణచివేసేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు.. నిరసన కారులపై భాష్పవాయుగోళాలు, వాటర్ ట్యాంకర్ లతో దాడులు చేశారు. దీంతో.. హుబ్లీ బ్రిడ్జి పైన వేలాదిగా విద్యార్థులు నిరసనలు చేపట్టారు.
আজ তৃণমূল ছাত্র পরিষদের প্রতিষ্ঠা দিবসটিকে আমি উৎসর্গ করছি আমাদের সেই বোনটিকে, যাঁকে আমরা কয়েক দিন আগে আর জি কর হাসপাতালে মর্মান্তিকভাবে হারিয়ে শোকাহত।
আর জি করে আমাদের সেই যে বোনকে নির্মমভাবে নির্যাতন করে হত্যা করা হয়েছিল, তাঁর পরিবারের প্রতি আন্তরিকতম সমবেদনা জানিয়ে এবং…
— Mamata Banerjee (@MamataOfficial) August 28, 2024
స్థానిక పోలీసులు ఎక్కడికక్కడ నిరసనలను అణచివేసే చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో .. నబన్న అభియాన్, 'పశ్చిమ్ బంగా ఛత్ర సమాజ్', అసమ్మతి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేదిక 'సంగ్రామి జౌతా మంచా' లు.. మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసలను చేపట్టాయి. ఇది కాస్త వివాదాస్పదంగా మారడంతో.. బీజేపీ 12 గంటల బంద్ కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో వెస్ట్ బెంగాల్ సీఎం ఎక్స్ వేదికగా చేసిన పోస్టు ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ రోజు కోల్‌కతా రేప్ - హత్య బాధితురాలికి మనోసారి ఎక్స్ వేదికగా తన సంతాపం వ్యక్తంచేశారు. ముఖ్యంగా ఈరోజు.. టీఎంసీ పార్టీ విద్యార్థి విభాగం వ్యవస్థాపక దినోత్సవాన్ని ట్రైనీ డాక్టర్ కు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. TMCPగా ప్రసిద్ధి చెందిన తృణమూల్ ఛత్ర పరిషత్ తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం. ఈ క్రమంలో మమతా ఎక్స్ లో .. తృణమూల్ ఛత్ర పరిషత్ స్థాపన దినోత్సవాన్ని మా సోదరికి అంకితం చేస్తున్నట్లు ఎక్స్ లో వెల్లడించారు.
కొన్ని రోజుల క్రితం RG కర్ హాస్పిటల్‌లో జరిగిన విషాకర సంఘటనకు చింతిస్తున్నామని Ms బెనర్జీ బెంగాలీలో X లో పోస్ట్ చేసారు. అంతేకాకుండా.. మరణించిన సోదరి కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపం కూడా వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధిత కుటుంబానికి సత్వర న్యాయం జరగాలని, నిందితులకు కఠినంగా పనిష్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఆగస్ట్ 9 న ట్రైనీ డాక్టర్ పై హత్య చార ఘటన దేశంలో తీవ్ర సంచలనంగా మారింది.
ఈ ఘటనపై అన్ని వర్గాల నుంచి ప్రజలు తమ నిరసనలు తెలియజేశారు. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ దూకుడు పెంచింది. ఈ ఘటలో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్ కు ఇప్పటికు పాలీగ్రాఫ్ టెస్టులు నిర్వహించారు. మరో ఆరుగురికి కూడా పాలీగ్రాఫ్ టెస్టులు నిర్వహించినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రస్తుతం సీబీఐ పోలీసులు డీఎన్ఎ టెస్టు రిపోర్టుల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో డీఎన్ఏ టెస్టు రిపోర్టులే కీలకంగా మారబోతున్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook