Kavitha Released: 164 రోజులకు బయటి లోకాన్ని చూసిన కవిత.. తిహార్‌ జైలు నుంచి విడుదల

K Kavitha Released From Tihar Jail After 164 Days: బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కవిత జైలు జీవితం వీడారు. బెయిల్‌పై తిహార్‌ జైలు నుంచి విడుదలయ్యారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Aug 27, 2024, 09:16 PM IST
Kavitha Released: 164 రోజులకు బయటి లోకాన్ని చూసిన కవిత.. తిహార్‌ జైలు నుంచి విడుదల

Kavitha Release From Jail: తెలంగాణకు చెందిన కీలక నాయకురాలు, బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొన్ని నెలల తర్వాత జైలును వీడారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి కొన్ని నెలల పాటు జైలు జీవితం అనుభవించిన కవిత ఎట్టకేలకు బయటకు వచ్చారు. సుప్రీంకోర్టు బెయిల్‌కు ఆమోదం తెలపడంతో ఆమె తిహార్‌ జైలు నుంచి విముక్తి పొందారు. దీంతో బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో సంబరాలు నిర్వహించారు.

Also Read: Kavitha Bail: కవితపై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు.. కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

బెయిల్‌పై కవిత బయటకు రావడంతో ఆమెను ఆమె సోదరుడు, బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తోపాటు ఆమె బావ హరీశ్ రావు, బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఢిల్లీలో బాణసంచా కాల్చి.. మిఠాయిలు పంచుకున్నారు. జైలు నుంచి నేరుగా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయానికి చేరుకుంటారని తెలుస్తోంది. లేకపోతే రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర నివాసానికి కూడా వెళ్లే అవకాశం ఉంది. బుధవారం ఢిల్లీలో కొన్ని న్యాయపరమైన ప్రక్రియ పూర్తి చేసుకుని మధ్యాహ్నానికి తెలంగాణకు చేరుకుంటారని సమాచారం.

Also Read: MLC Kavitha Case: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ to బెయిల్.. పూర్తి వివరాలు ఇవే..!

కవితకు బెయిల్‌ లభించడంతో తెలంగాణ రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. ఈ బెయిల్‌ అంశంపై కాంగ్రెస్‌, బీజేపీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. బెయిల్ రావడంపై కాంగ్రెస్‌, బీజేపీలు వక్ర భాష్యం చెబుతున్నాయి. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాటిని కవిత సోదరుడు, బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అరెస్ట్‌.. విడుదల
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 26వ తేదీన హైదరాబాద్‌లో కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్ట్‌ చేసింది. 2022 జూలైలో వెలుగులోకి వచ్చిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమెను అరెస్ట్‌ చేశారు. ఢిల్లీ, హైదరాబాద్‌లో అనేక విచారణలు చేసిన తర్వాత కవితను అదుపులోకి తీసుకుని మార్చి 16వ తేదీ నుంచి న్యూఢిల్లీలోని తిహార్‌ జైలుకు వెళ్లారు. అనంతరం ఆమె బెయిల్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎన్నికలు, పిల్లల చదువు, అనారోగ్యం ఇలా ఏ కారణం చెప్పినా కూడా న్యాయస్థానాలు బెయిల్‌ మంజూరు చేయలేదు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News