Malaika Arora Fitness: అందం, ఫిట్నెస్ గురించి మాట్లాడుకోవాలంటే బాలీవుడ్ నటి మలైకా అరోరా గురించే చెప్పుకోవాలి. 50 ఏళ్ల వయస్సులోనూ 25 ఏళ్ల పడుచులా ఫిట్నెస్, ఒంటి సొంపులు ఆమెకే సొంతం. జీవితంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా అందం, ఫిట్‌నెస్‌లో మాత్రం వెనక్కు తగ్గడం లేదు. అందమైన మలైకా ఫోటోలు కొన్ని మీ కోసం..
బాలీవుడ్ సూపర్ మోడల్, డ్యాన్సర్, నటి మలైకా అరోరా మరోసారి గ్లామర్, ఫిట్నెస్ ఫోటోలతో ఇంటర్నెట్ హీటెక్కించింది. వర్షాకాలం వెకేషన్ ఎంజాయ్ చేస్తూ బికినీ సూట్‌తో అందర్నీ వివశుల్ని చేసే ఫోటోలు, వీడియో షేర్ చేసింది.
వాస్తవానికి మలైకా అరోరా, అర్జున్ కపూర్ బ్రేకప్ వార్తలు చాలాకాలంగానే విన్పిస్తున్నాయి. కానీ ఎవరూ దీనిపై స్పందించలేదు. సోషల్ మీడియాలో మలైకా అరోరాకు 18.9 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు
మలైకా అరోరా వర్సెస్ అర్జున్ కపూర్ బ్రేకప్ వార్తలు చాలా కాలంగా విన్పిస్తున్నాయి. బ్రేకప్ అయిపోయింది కూడా.
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో , ఫోటోలకు కామెంట్లు పెద్ద ఎత్తున వస్తున్నాయి. కొంతమంది తమకు ఇన్స్పిరేషన్ అంటున్నారు. ఇంకొంతమంది ఫిట్నెస్ అంటే మలైకా అంటున్నారు. మరి కొంతమంది ఫిట్నెస్ సీక్రెట్ అడుగుతున్నారు. అర్జూన్ కపూర్‌తో బ్రేకప్ తరువాత మలైకా మరింత స్ట్రాంగ్ అయినట్టు కన్పిస్తోంది
ఇన్స్టాగ్రామ్ ఎక్కౌంట్లో ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో సముద్రతీరాన సేద తీరుతూ కన్పిస్తుంది. బికినీ సూట్‌తో, స్లీవ్‌లెస్ సూట్‌తో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ పూర్తి రిలాక్సింగ్ మోడ్‌లో ఉంది. ఆమె ఫిట్నెస్ చూస్తే 50 ఏళ్లంటే ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా 25 ఏళ్ల పడుచులానే కన్పిస్తుంది