Ktr reached budhabhavan to attend before womens commission: తెలంగాణలో ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకొవచ్చు. కాంగ్రెస్ , బీఆర్ఎస్ లు ఒకరిపై మరోకరు చేసుకుంటున్న ఆరోపణలు పీక్స్ కు చేరాయి. ఈ వ్యాఖ్యలు వర్షాకాలంలో హీట్ ను పెంచుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల.. మహిళల ఉచిత బస్సుప్రయాణాలపై వ్యాఖ్యలు చేస్తు.. బస్సులో కొంత మంది కుట్లు అల్లికలు చేస్తున్నారని, బ్రెష్ చేసుకుంటున్న వీడియోలు వైరల్ అవుతున్నాయని అన్నారు. బస్సులో బ్రేక్ డ్యాన్స్ లు చేసిన పర్వాలేదు.. కానీ బస్సుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వాన్ని ఉద్దేశించి వెటకారంగా కామెంట్లు చేశారు. ఈ క్రమంలో.. ఇది కాస్త పెనుదుమారంగా మారింది.
మహిళా కమిషన్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత
కేటీఆర్ మీద దాడికి యత్నించిన కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు pic.twitter.com/88DGSGsVBo
— Telugu Scribe (@TeluguScribe) August 24, 2024
కేటీఆర్ మహిళలను అపహాస్యం చేసేవిధంగా మాట్లాడారని మహిళ లోకం ఫైర్ అయ్యింది. అంతేకాకుండా.. కాంగ్రెస్ మంత్రి సీతక్క కూడా ఈ వ్యాఖ్యల పట్ల ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు సైతం.. ఈ ఘటనపై కేటీఆర్ తీరును తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. దీంతో దిగోచ్చిన కేటీఆర్.. ఎక్స్ వేదికగా మరల అక్కా చెల్లెమ్మలకు సారీ అంటూ మరో పోస్ట్ పెట్టారు. కానీ ఈ ఘటనను మహిళ కమిషన్ సీరియస్ గా తీసుకుంది.
కేటీఆర్ వ్యాఖ్యలు మహిళ లోకాన్ని కించపర్చే విధంగా ఉన్నాయంటూ ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి, తమ ఎదుట హజరు కావాలని కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఈ రోజు కేటీఆర్ (శనివారం) బుద్దభవన్ లోని మహిళ కమిషన్ ఎదుట హజరయ్యారు. ఈ నేపథ్యంలో కార్యాలయంలో ఎదుట హైటెన్షన్ నెలకొంది.
పూర్తి వివరాలు..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మహిళ కమిషన్ ఎదుట హజరయ్యేందుకు బుద్ధభవన్ కు వచ్చారు. ఆయనతో పాటు మాజీ మహిళ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, సత్యవతి రాథోడ్ తదితరులు హజరయ్యారు. ఈ క్రమంలో.. బుద్దభవన్ బైట కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేటీఆర్ హజరు కానుడటంతో పెద్ద ఎత్తున బీఆర్ఎప్ కార్పోరేటర్ లు, కాంగ్రెస్ మహిళ నేతలు అక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ మహిళ కమిషన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావ్ అక్కడికి చేరుకుని బైఠాయించారు.
కేటీఆర్ ట్విటర్ లో కాదు.. బహిరంగంగా మహిళలకు సారీ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. మహిళల్ని కించపర్చే విధంగా మాట్లాడినందుకు.. బస్సులలో ఎక్కి అక్కా చెల్లెమ్మలకు సారీ చెప్పాలని కూడా ఫైర్ అయ్యారు.దీంతో బుద్దభవన్ ఎదుట బీఆర్ఎస్, కాంగ్రెస్ మహిళ కార్పోరేటర్ లు పోటాపోటీగా నినాదాలు చేశారు.అంతేకాకుండా అక్కడ తోపులాట కూడా చోటు చేసుకుంది. కేటీఆర్ ఉన్న పోలీసుల వాహానాన్ని కాంగ్రెస్ మహిళ నేతలు అడ్డుకున్నారు. కేటీఆర్ పై దాడికి కూడా యత్నించినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter