CM Revanth Reddy: మీ తాత ముత్తాతలు దిగొచ్చినా ఏం చేయలేరు.. బీఆర్ఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్

Congress Protest at ED Office: సెబీ చైర్‌పర్సన్‌ ఆస్తులపై ఈడీ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ గన్‌పార్క్‌ సమీపంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీలపై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Aug 22, 2024, 03:57 PM IST
CM Revanth Reddy: మీ తాత ముత్తాతలు దిగొచ్చినా ఏం చేయలేరు.. బీఆర్ఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్

Congress Protest at ED Office: బీఆర్ఎస్ నాయకులపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. బీజేపీ దేశ సంపదను దోచుకుంటున్నా.. బీఆర్‌స్ అనుకూలంగా ఉందని విమర్శించారు. జేపీసీపై బీఆర్ఎస్ విధానం స్పష్టం చేయాలన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని.. మీ తాత ముత్తాతలు దిగొచ్చినా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏం చేయలేరని సవాల్ విసిరారు. రాజీవ్ విగ్రహంపై చేయి వేస్తే వీపు చింతపండు చేస్తామని హెచ్చరించారు. ఎవడు తొలగిస్తాడో రావాలని.. తేదీ చెప్పాలని సవాల్ విసిరారు. ఈడీ కార్యాలయం  ఎదుట నిరసన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.

Also Read: Harish Rao: మాట తప్పిన రేవంత్‌.. పాపం తగలకుండా హరీశ్ రావు ఆలయాల యాత్ర

పదేళ్ల తరువాత ఈ సన్నాసులకు తెలంగాణ తల్లి గుర్తొచ్చిందని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనిపించే తెలంగాణ తల్లి సోనియమ్మ అని.. ఆమె జన్మదినం డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. తాము తెలంగాణ తల్లికి నిజమైన వారసులమని నిరూపించుకుంటామన్నారు. రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఈ సన్నాసులను నమ్ముకుని రైతులు రోడ్డెక్కొద్దని కోరారు. పదేళ్లు మిమ్మల్ని దోచుకు తిన్న ఈ బీఆర్ఎస్ దోపిడీ దొంగలను నమ్మొద్దన్నారు. పదేళ్లలో వాళ్లు ఇచ్చింది ఎంత.. పది నెలల్లో తాము ఇచ్చింది ఎంత చర్చకు సిద్ధమన్నారు. రాజీనామా చేయాల్సి వస్తుందని హరీష్ డ్రామాలు చేస్తున్నారని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  బీఆర్‌ఎస్‌కు 39లో 9 కూడా మిగలవని జోస్యం చెప్పారు.

"అదానీ కుంభకోణంపై చట్ట సభల్లో సమాధానం ఇవ్వకుండా మోదీ పారిపోయారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2014 వరకు ప్రధానులు చేసిన అప్పు రూ.55 వేల కోట్లు. పదకొండేళ్లలో ప్రధాని మోదీ చేసిన అప్పు లక్షా 15 వేల కోట్లు. 16 మంది ప్రధానులు చేసిన అప్పు కంటే మోదీ రెండింతలు అప్పులు చేశారు. దేశంలో సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చిన ఘనత పండిట్ జవహర్ లాల్ నెహ్రూది. బ్యాంకుల జాతీయకరణతో ఇందిరమ్మ పేదలకు బ్యాంకులను అందుబాటులోకి తెచ్చారు. సాహసోపేత నిర్ణయంతో పేదలకు భూములు పంచిన ఘనత ఇందిరమ్మది. దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీ గారు. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్ ప్రవేశ పెట్టిన మహానేత రాజీవ్ గాంధీ. హమ్ దో.. హమారే దో అన్నట్లు మోదీ అమిత్ షా వ్యవహారం ఉంది. ప్రపంచాన్ని దోచుకునేలా ఆ ఇద్దరి వ్యవహార శైలి ఉంది.

దుష్టచతుష్టయం దేశాన్ని దోచుకుంటోంది. సెబీ చైర్ పర్సన్ తక్షణమే రాజీనామా చేయాలి.. లేకపోతే కేంద్రమే ఆమెను తొలగించాలి.. జరిగిన కుంభకోణంపై ఈడీ విచారణ చేపట్టాలి. ఎంత గొప్ప స్థానంలో ఉన్నా పార్టీ పిలుపునిస్తే పాటించాల్సిందే.. అందుకే నేను ముఖ్యమంత్రినైనా ఒక కార్యకర్తగా నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చా. దేశానికి బీజేపీ ముప్పుగా మారింది.. ఈ ముప్పును తొలగించాల్సిన బాధ్యత ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తపై ఉంది. కుంభకోణంపై బీఆర్ఎస్ నేతలు బీజేపీని ఎందుకు ప్రశ్నించడం లేదు..

వాళ్లు విలీనమైతరో మలినమైతరో మాకు సంబంధం లేదు. బీజేపీని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదు. ట్విట్టర్ టిల్లు కేటీఆర్ ఈ దోపిడీపై ఎందుకు మాట్లాడటం లేదు. దేశ సంపదను దోచుకుంటున్న బీజేపీకి బీఆర్ఎస్ అనుకూలం అనడానికి ఇది నిదర్శనం. జేపీసీపై బీఆర్ఎస్ విధానం స్పష్టం చేయాలి.." సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  

Also Read: Red King Kobra: ఎరుపు రంగులో నాగుపాము వయ్యారాలు.. చూస్తే మతిపోతది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News