Woman in saree shows off giant venomous snake wrapped around her body video: చాలా మంది పాముల్ని చూడగానే భయంతో పారిపోతుంటారు. కొంత మంది అయితే.. పాముల పేర్లు ఎత్తడానికి సైతం సాహసం చేయరు. అడవులు, చెరువులు ఉన్న చోట పాములు ఎక్కువగా బైటకు వస్తుంటాయి. వర్షాకాలంలో పాముల బెడగా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఎలుకల కోసం పాములు మన ఇళ్లకు వచ్చేస్తుంటారు.
కొన్నిసార్లు బట్టలలో, వాహానాలలో పాములు వచ్చి దాక్కుంటాయి. అంతేకాకుండా.. పాములు.. కొన్నిసార్లు షూస్ లలో కూడా దాక్కుని ఉంటాయి. పాములకు చెందిన వీడియోలు తరచుగా వార్తలలో ఉంటాయి. కొన్ని వీడియోలు షాకింగ్ కు గురిచేసేవిలా ఉంటే.. మరికొన్నిషాకింగ్ కు గురిచేస్తుంటాయి.
పాములకు చెందిన కంటెంట్ చూసేందుకు నెటిజన్లు సైతం ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో పాములు కన్పించగానే కొంత మంది స్నేక్ రెస్క్యూ టీమ్ కు సమాచారం ఇస్తారు. కొన్నిసార్లు పాములు పట్టేటప్పుడు అనుకొని ఘటనలు సైతం చోటుచేసుకుంటాయి. ఈ కోవకు చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తివివరాలు..
చాలా మంది పాముల్ని పట్టడం కూడా హబీగా పెట్టుకుంటారు.. ఎక్కడైన పాములు కన్పిస్తే.. వెంటనే తమకు చెప్పాలని చెప్తుంటారు. saiba__19 ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక ఇంట్లోకి పాము దూరిపోయింది. వెంటనే అక్కడున్న వారు పాములను కాపాడే.. యువతికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆమెచాకచక్యంగా ప్రవర్తించి, పామును రెస్క్యూ చేసింది.
యువతి పామును పట్టేటప్పుడు వర్షంకూడా పడుతుంది. ఈ క్రమంలో..అక్కడున్న వారు భయపడిపోయిదూరంగా పారిపోయారు. అయిన కూడా.. ఆ మహిళ ఏ మాత్రం భయపడకుండా.. పామును చాకచక్యంగా పట్టుకుంది. అక్కడున్నవారు భయంతో దూరంగా పారిపోతున్నారు. కానీ యువతి మాత్రం ఏ మాత్రం వెరకుండా.. పామును పట్టుకుని, ఒక బ్యాగులో వేసుకుంది. ఆ తర్వాత దగ్గరలోని అడవిలో వెళ్లి వదిలేసింది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్లు బాబోయ్.. అంటూ భయపడి పోతున్నారు. మరికొందరు మాత్రం.. ఇదేం ధైర్యంరా బాబోయ్.. అంటూ కామెంట్ లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం.. పాము విషయం పక్కడ పెడితే.. అమ్మాయి రెడ్ చీరలో భలే క్యూట్ గా ఉందంటూ కూడా ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter