Balakrishna: నట సింహమైనా అక్కాచెల్లెళ్ల కాలు మొక్కాల్సిందే! బాలకృష్ణ రాఖీ సందడి.

Balakrishna Touches His Sisters Feet For Rakhi: సినిమా, రాజకీయాలతో బిజీగా ఉండే నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ రాఖీ పండుగ సందర్భంగా సరదాగా గడిపారు. తన సోదరిమణులతో సందడి చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Aug 20, 2024, 06:42 PM IST
Balakrishna: నట సింహమైనా అక్కాచెల్లెళ్ల కాలు మొక్కాల్సిందే! బాలకృష్ణ రాఖీ సందడి.

Balakrishna Rakhi: సినిమాల్లో విలన్లను తుక్కు రేపే హీరో అయినా.. రాజకీయాల్లో ప్రత్యర్థులను చిత్తు చేసే రాజకీయ నాయకుడు అయినా అక్కాచెల్లెమ్మల ముందు సోదరుడే. అన్నగా వారి బాధ్యతలు.. తమ్ముడి అక్కల ప్రేమలకు బానిస అవ్వాల్సిందే. అలాంటి పరిస్థితే సినీ నటుడు, తెలుగుదేశ పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఎదురైంది. రాఖీ పండుగ సందర్భంగా తన అక్కాచెల్లెమ్మల వద్ద బాలకృష్ణ కాలు మోకారిల్లాడు. తన సోదరీమణులకు పాదాభివందనం చేశాడు. ఈ సందర్భంగా బాలకృష్ణకు సంబంధించిన వీడియో నవ్వులు తెప్పిస్తోంది.

Also Read: Balakrishna: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు బాలకృష్ణ దెబ్బ అదుర్స్‌.. ఇక తిరుగేలేదు

ప్రపంచవ్యాప్తంగా హిందూవులు సోమవారం రాఖీ పండుగను చేసుకున్నారు. సినీ, రాజకీయ, పారిశ్రామిక, ఇతర రంగాల ప్రముఖులు కూడా రాఖీ పండుగ తమ సోదరీమణులతో ఆనందోత్సాహాలతో చేసుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ రాఖీ పండుగ ఆనందంగా జరిగింది. ఈ క్రమంలోనే ఏపీకి చెందిన ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కూడా రాఖీ పండుగ చేసుకున్నాడు. తన అక్కలు, చెల్లెళ్లమ్మతో కలిసి బాలకృష్ణ రాఖీ వేడుకల్లో పాల్గొన్నాడు.

Also Read: Raksha Bandhan 2024: వైఎస్‌ జగన్‌కు రాఖీ కట్టని షర్మిల.. అన్నాచెల్లెళ్ల మధ్య పెరుగుతున్న దూరం

రాఖీ పండుగ రోజు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని బాలకృష్ణ నివాసం సందడిగా మారింది. అతడి సోదరీమణులు నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, సుహాసిని తదితరులు తరలివచ్చారు. బాలకృష్ణకు తిలకం దిద్ది రాఖీలు కట్టారు. అనంతరం మిఠాయి తినిపించి హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా పురందేశ్వరి, భువనేశ్వరి బాలకృష్ణను ఆట పట్టించారు. కాళ్లు మొక్కాలని బలవంతం పెట్టారు. బాలకృష్ణతోపాటు అతడి సతీమణి వసుంధర కూడా అందరి కాళ్లు మొక్కారు.

పాదాభివందనం చేస్తుండగా పురందేశ్వరి మరింత కిందకు వంగి నమస్కరించాలని సరదాగా ఆట పట్టించారు. భువనేశ్వరి కూడా అలాగే చేశారు. దీంతో బాలకృష్ణ వారితో సరదాగా ఉన్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ దృశ్యాలన్నింటిని బాలకృష్ణ కుమార్తెలు వీడియో తీశారు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. బాలకృష్ణ తన సోదరిమణులతో ఆప్యాయంగా ఉంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో ప్రమాణస్వీకారం సందర్భంగా భువనేశ్వరిని ప్రత్యేకంగా ఆశీర్వదించడం అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే మాదిరి తన సోదరిమణులతో బాలకృష్ణ సందడిగా గడిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News