Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో రాత్రి నుంచి ఏకధాటిగా భారీ వర్షం కురుస్తోంది. ఉప్పల్, రామంతపూర్, హబ్సిగూడ, నాగోల్, తార్నాక ప్రాంతాలతో పాటు సరూర్ నగర్, ఎల్బి నగర్, దిల్సుఖ్ నగర్, చార్మినార్, రాజేంద్రనగర్, ఆబిడ్స్, మెహదీపట్నం ప్రాంతాల్లో జలమయమైనట్టు సమాచారం.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మేఘాలు విరుచుకుపడేట్టుగా భారీ వర్షం కురుస్తోంది. నిన్న అంటే సోమవారం రాత్రి నుంచి ఏకధాటిగా భారీ వర్షం పడుతోంది. రాత్రి 8 గంటల నుంచి తెల్లవారజామున 3 గంటల వరకూ చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షం నమోదైంది. ఖైరతాబాద్, షేక్ పేట్లో 54.5 మిల్లీమటీర్లు, శేర్ లింగంపల్లిలో 52.5 మిల్లీమీటర్లు, బాలానగర్‌లో 44.8 మిల్లీమీట్లు, గోల్కొండలో 41 మిల్లీమీటర్లు, రాజేంద్రనగర్‌లో 30 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది.
ఇక తెలంగాణలోని నల్గొండలో రాత్రి అత్యధికంగా 109.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు సిద్దిపేట్లో కూడా 109 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లా భీంగల్ ప్రాంతంలో 106.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సిద్ధిపేట్ జిల్లా చాట్లపల్లిలో 96.3 మిల్లీమీటర్లు, గండిపల్లిలో 92 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. యాదాద్రి జిల్లా యాదాద్రిగుట్టలో 90.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇక నిర్మల్, ఖమ్మం, జోగులాంబ గద్వాల్, వికారాబాద్, నారాయణ పేట్, భువనగిరి జిల్లాల్లో కూడా రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం పడుతోంది.
ఇక ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్, సరూర్ నగర్, ఆబిడ్స్, మెహిదీపట్నం, ఉప్పల్, రామంతపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది.
Also read: Uma Maheshwaram: నల్లమల్ల కొండల్లో ఆకర్షిస్తున్న జలపాతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook